Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Jun-2017 11:37:50
facebook Twitter Googleplus
Photo

సినిమా విడుదల అయ్యింది అంటే ఒక థియేటర్ని అభిమానులు అలకంరించే పద్దతి ఉంటుంది చూడండి దేవుడు కి జరుపుతున్న బ్రహ్మోత్సవం అనే చెప్పుకోవాలి. అలాంటిది హైదరాబాద్ లో ఒక గొప్ప సినిమా థియేటర్ల జంక్షన్ గా పేరున్న ఆర్ టిసి క్రాస్ రోడ్ లో ఒక స్టార్ సినిమా విడుదలైతే అక్కడ బొమ్మ పడవలిసిందే. స్టార్లు ఎవరైనా కావచ్చు లేదా ఒక యంగ్ హీరో కావచ్చు సినిమా విడుదల అయితే అక్కడ ఉండవలిసిన కట్-ఔట్ ఆ సినిమాలో నటించిన హీరోదే. ఇది తెలుగు సినిమా ఆనవాయితీ అనుకోండి. కాకపోతే ఇప్పుడు ఒక హీరో పక్కన అంతే ఎత్తుగల మరో కట్ ఔట్ డైరెక్టర్ కు కూడా పెట్టారు.

దువ్వాడ జగన్నాధమ్ సినిమా విడుదలైంది అభిమానులు నిరీక్షణ కు తెరపడింది. అయితే ఆర్ టిసి క్రాస్ రోడ్ లో ప్రధానగా చెప్పుకోతగ్గ ఒక థియేటర్లో ఈ సినిమా విడుదల అవ్వగా.. అక్కడ పెద్ద అల్లు అర్జున్ కట్ ఔట్ కనిపించడం షరా మామూలే. కాకపోతే ఆ పక్కనే మరో కట్ ఔట్ ఉంది అదే సైజ్ లో. అది ఆ సినిమా డైరెక్టర్ హరీష్ శంకర్ బొమ్మ. హీరోలును స్టార్లుగా చేసిన రాజమౌళి - త్రివిక్రమ్ - వినాయక్ - బోయపాటి - కొరటాల శివ లాంటి వారు కూడా ఎప్పుడు ఇలాంటి కటౌట్లు చూసుండరు. మరి ఇప్పుడు హరీష్ శంకర్ కోసం ఎందుకు ఇంత ఆడంబరం చేస్తున్నారో ఎవరికి అర్ధంకాలేదు.

దువ్వాడ జగన్నాధం సినిమాలో అల్లు అర్జున్ ఒక మాట అంటాడు సభ్య సమాజంకు ఏమి మెసేజ్ ఇద్దామని. ఇప్పుడు హరీష్ శంకర్ కు ఒక కటౌట్ పెట్టేసి ఏం మెసేజ్ ఇద్దామనుకున్నారో ఏంటో. ఏదేమైనా కూడా డైరక్టర్లను కూడా హీరో స్థాయిలో అభిమానించడం.. నిజంగా తెలుగు ప్రేక్షకులకే చెల్లింది.

,  ,  ,  ,