Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Jun-2015 11:09:22
facebook Twitter Googleplus
Photo

యువ కథానాయకులు తమ సినిమా కోసం అప్పుడప్పుడు గాయకులుగా మారిపోతుంటారు. కొత్తదనం కోసం .. అభిమానులలో మరింత ఉత్సాహాన్ని నింపడం కోసం .. ఆ సినిమాకి అదనపు ఆకర్షణ అవుతుందనే ఉద్దేశంతో ఇలాంటి ప్రయోగాలు చేస్తుంటారు. ఈ తీరు బాలీవుడ్ .. టాలీవుడ్లోనే కాదు, కోలీవుడ్లోను బాగానే కనిపిస్తుంది. హీరో విజయ్ తన తాజా చిత్రం 'పులి' కోసం ఒక పాట పాడటాన్ని ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.'

అయితే తన సినిమాలో పాట పాడటం విజయ్ కి ఇది మొదటిసారి కాదు. ఇంతకు ముందు ఆయన 'తుపాకీ' .. 'తలైవా' చిత్రాలలో పాడాడు. ఈ సినిమాలు ఆయన క్రేజ్ నీ .. ఇమేజ్ ని మరింత పెంచాయి. ఆ సెంటిమెంట్ తో ఇప్పుడు విజయ్ 'పులి' సినిమాలోనూ ఒక పాట పాడాడు. దర్శకుడు శింబు దేవన్ కోరడంతో, దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో విజయ్ పాడిన ఈ పాట చాలా బాగా వచ్చిందని తెలుస్తోంది. మరి పులి పాడిన ఈ పాటని ప్రేక్షకులు ఎంతలా ఎంజాయ్ చేస్తారో చూడాలి.

,  ,  ,  ,  ,  ,