Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Jan-2015 09:57:35
facebook Twitter Googleplus
Photo

తమ సినిమాల్లో ఓ పాటను ఆయా హీరోలే పాడుకోవడం ఇప్పుడు ట్రెండ్ అయింది. దీని వల్ల ఆయా సినిమాలకు అదనపు ఆకర్షణ చేకూరుతుంది. ఈ విషయంలో తమిళ హీరోలు కాస్త స్పీడుగానే వున్నారు. ఇప్పుడు హీరో విజయ్ కూడా తన తాజా చిత్రంలో ఓ పాట పాడుకోనున్నాడు. శింబుదేవన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'పులి' సోషియో ఫ్యాంటసీ సినిమాలో హీరోయిన్ శ్రుతి హాసన్ తో కలసి విజయ్ ఓ డ్యూయెట్ పాడతాడు. ఈ విషయాన్ని చిత్ర సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కన్ఫర్మ్ చేశాడు. "వీరిద్దరూ మంచి సింగర్లే. కాబట్టి, వీరిద్దరూ కలసి 'పులి'లో ఓ పాట పాడతారు" అన్నాడు దేవిశ్రీ.

,  ,  ,  ,  ,  ,