Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-May-2017 10:37:13
facebook Twitter Googleplus
Photo

బాహుబలి ది కంక్లూజన్ సాధిస్తున్న కలెక్షన్స్ వర్షం.. టాలీవుడ్ సత్తాను స్థాయిని ప్రపంచానికి చూపిస్తోంది. ఇదే సమయంలో బాహుబలికి పని చేసిన అందరికీ ఎంతో గుర్తింపు లభిస్తోంది. రాజమౌళి.. ప్రభాస్ ల తర్వాత అందరికంటే ఎక్కువగా రచయిత విజయేంద్ర ప్రసాద్ కు ఖ్యాతి లభిస్తోంది.

ఇప్పటికే దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన ఈయన.. రీసెంట్ గా బాహుబలి ఇంటర్వెల్ సీన్ ను పవన్ కళ్యాణ్ క్రేజ్ ను స్ఫూర్తిగా తీసుకుని రాసుకున్నామని చెప్పి ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు తాజాగా మరో ఇంటర్వ్యూలో పవన్ ప్రస్తావన వచ్చినపుడు విజయేంద్ర ప్రసాద్ ఇచ్చిన సమాధానాలు మళ్లీ షాక్ ను ఇచ్చాయి. అన్ని ప్రశ్నలకు సింగిల్ వర్డ్ సమధానాలిచ్చిన ఈ స్టార్ రైటర్.. పవన్ గురించి మాత్రం కొంచెం లెంగ్తీ ఆన్సర్స్ ఇవ్వడం విశేషం. పవన్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. పవన్ కళ్యాణ్ సిన్సియారిటీ నాకు చాలా ఇష్టం అన్నాడు విజయేంద్ర ప్రసాద్.

పవన్ పార్టీ అయిన జనసేన గురించి సినిమా జనాలు మాట్లాడిన సందర్భాలు ఉండవ్. కానీ విజయేంద్ర ప్రసాద్ ఈ విషయంలో కూడా ఏ మాత్రం తడుముకోకుండా.. ఆయన పార్టీ విజయం సాధించాలని కోరుకుంటున్నా అని చెప్పడం విశేషం.

,  ,  ,  ,