Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Apr-2016 12:42:55
facebook Twitter Googleplus
Photo

సాయి కుమార్ కొడుకుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఆది.. మొదట్లో బాగానే క్రేజ్ సంపాదించుకున్నాడు. కానీ సడెన్ గా మాస్ హీరో ఇమేజ్ కోసం పాకులాడ్డం మొదలుపెట్టి వరుస ఫ్లాపులతో బాగా వెనకబడిపోయాడు. రీసెంట్ గా విడుదలైన గరం అయితే.. అందరికీ మంట పుట్టించేసింది. అసలీ సినిమా మధ్యలో ఆగిపోతే.. తనే నిర్మాణ బాధ్యతలు చేపట్టి కంప్లీట్ చేసి 2 కోట్లు నష్టపోయాడు సాయికుమార్.

ఇప్పుడీ ఆది చేతిలో ఉన్నది ఒకటే సినిమా. వీరభద్రం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చుట్టాలబ్బాయి. పోనీ ఈ దర్శకుడేమైనా మంచి ఫామ్ లో ఉన్నాడా అంటే.. ఈయన గతంలో తీసిన మూవీ భాయ్. దాని రిలీజ్ తర్వాత.. అసలా సినిమా ఎందుకు చేశానా అని ఫీలయినట్లు నాగ్ స్వయంగా చెప్పేశాడు. ఇప్పుడా షాక్ నుంచి కోలుకుని చుట్టాలబ్బాయిని వీరభద్రం ఏ మేరకు తెరకెక్కిస్తున్నాడో చూడాలి. ఒకవేళ ఇది కూడా తేడా చేసిందంటే మాత్రం.. ఇక ఆది - వీరభద్రంలు కోలుకోవడానికి ఏళ్లకు ఏళ్లు పడుతుంది.

మరి ఇద్దరికీ విపరీతమైన రేంజులో బ్రేక్ రావల్సిన ఈ తరుణంలో.. వీరి సినిమా వర్కింగ్ స్టిల్స్ గట్రా చూస్తుంటే.. కాస్త రొటీన్ గానే అనిపిస్తోంది. కాని ఏదో ఒకటి చేసి ఆకట్టుకుంటారని కోరుకుందాం.

,  ,  ,  ,  ,  ,  ,