Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Jun-2015 10:47:58
facebook Twitter Googleplus
Photo

ప్రస్తుతం తమిళంలో నిర్మాణంలో వున్న సినిమాల్లో 'పులి' సినిమా పట్ల విపరీతమైన క్రేజ్ వుంది. అటు అభిమానుల్లోనే కాకుండా ... ఇటు వ్యాపార వర్గాలలో కూడా ఈ చిత్రం పట్ల ప్రత్యేక ఆసక్తి వుంది. స్టార్ హీరో విజయ్ కథానాయకుడుగా నటిస్తున్న ఈ సోషియో ఫ్యాంటసీ చిత్రం టీజర్ ఇప్పుడు యూ ట్యూబ్ లో దుమ్మురేపుతోంది. దీనిని విడుదల చేసిన ఎనిమిది రోజుల్లోనే 44 లక్షల హిట్స్ సంపాదించుకుంది. త్వరలోనే కోటి మార్కును చేరుకుంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. శ్రుతి హాసన్, హన్సిక హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో నాటి అందాలతార శ్రీదేవి మహారాణి పాత్రను పోషిస్తోంది. దీనికి శింబుదేవన్ దర్శకత్వం వహిస్తున్నాడు.

,  ,  ,  ,