Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Oct-2016 14:08:40
facebook Twitter Googleplus
Photo

కళ్యాణ్ రామ్ న్యూ స్టైలిష్ లుక్ విత్ సిక్స్ ప్యాక్ పూరీ మార్కు ప్రమోషన్ కలిసి ఇజం సినిమాను మొదట్నుంచి యాక్షన్ థ్రిల్లర్ అనే అంతా అనుకున్నారు సినీ జనాలనుంచి కూడా అలాంటి ప్రొజెక్టే చేస్తున్నాడు పూరి జగన్నాథ్ అని హింట్స్ వచ్చాయి. ఇదే సమయంలో పోస్టర్సూ ముఖ్యంగా టైటిల్ లో ఇచ్చిన క్లారిటీ చూస్తే ప్రధానంగా ఈ సినిమా పూరి మార్కు హీరో"యిజం" మీదే నడిచేలాగా కనిపించింది. ఇదే సమయంలో హీరోయిన్ టీజింగులు సరదా సన్నివేశాలూ పూరి స్టయిల్లోనే ఉంటాయని ట్రైలర్ ద్వారా ఒక క్లారిటీకి వచ్చేశారు జనం! ఐతే "ఇజం"లో అంతా అనుకున్నట్లు యాక్షన్ - టీజింగ్ - రొమాన్స్ మాత్రమే కాదు పూరి గత సినిమాలకు భిన్నంగా పెయిన్ ఫుల్ లవ్ స్టోరీ కూడా ఉంటుందని అంటున్నాడు కళ్యాణ్ రామ్.

ఈ మాటలకు బలం చేకూర్చేదిగానే ఉంది "ఇజం" సినిమాకు సంబంధించి తాజాగా వదిలిన రిలీజ్ డేట్ ప్రోమో! అందులో హీరోయిన్ బురఖా వేసుకుని - గన్ను పట్టుకుని ఎక్కడెక్కడో తిరిగిస్తోంది.. అత్యంత దీనంగా కనిపిస్తోంది.. దీంతో ఇజంలో ప్రేమకథ కూడా ఉందనే క్లారిటీకి వచ్చేస్తున్నారు సినిమా అభిమానులు. ఇజం సినిమా ద్వితీయార్ధమంతా యాక్షన్ మోడ్ లోనే ఉంటుందని ఐతే ప్రథమార్ధంలో ఒక క్యూట్ అండ్ పెయిన్ ఫుల్ లవ్ స్టోరీ పెట్టామని కళ్యాణ్ రామ్ కూడా బలంగా చెబుతున్నాడు. అయితే ఈ లెక్కన పూరీ మార్కు పెయిన్ ఫుల్ లవ్ స్టోరీ "ఇజం"లో కనిపించబోతుందన్నమాట!

కాగా పూరీ మార్కుతో విడుదల కాబోతున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన మాజీ మిస్ ఇండియా అదితి ఆర్య నటిస్తోంది. ఆమెకు ఇదే తొలి తెలుగు చిత్రం. కళ్యాణ్ రామ్ నిర్మాతగా రాబోతున్న ఈ "ఇజం" పూర్తిగా బ్లాక్ మనీ గుట్టు రట్టు చేసే కథాంశంతో సాగుతుందట.

,  ,  ,  ,