Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Oct-2016 17:14:36
facebook Twitter Googleplus
Photo

వీర్య దానం నేపథ్యంలో మన దేశంలో ఒక కామెడీ మూవీ రావడం అంటే ఆశ్చర్యం కలిగించే విషయమే. ఐతే అలాంటి సినిమా రావడమే కాదు.. గొప్ప ఆదరణ కూడా సంపాదించుకుంది ?విక్కీ డోనర్?. హిందీ సినిమాలకు మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఆదరణ పెద్ద స్థాయిలో ఉంటుంది కాబట్టి.. వాళ్ల మార్కెట్ పెద్దది కాబట్టి అక్కడ వర్కవుట్ అయితే కావచ్చు. అదే కాన్సెప్ట్ తో తెలుగులో సినిమా చేయడం అంటే సాహసమే. ఐతే సుమంత్ అండ్ కో ఏ సందేహాలు పెట్టుకోకుండా ?విక్కీ డోనర్?ను ?నరుడా డోనరుడా? పేరుతో తెలుగులోకి తీసుకొచ్చింది. ఇలాంటి సినిమాను మన ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని సందేహించారు కానీ.. దీని ఫస్ట్ లుక్ పోస్టర్.. ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్ చూశాక ఆ సందేహాలన్నీ తొలగిపోయాయి.

ఐతే ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉన్నప్పటికీ సెన్సార్ వాళ్లు ఈ సినిమా విషయంలో ఎలా స్పందిస్తారో అన్న అనుమానాలు కలిగాయి ఓ దశలో. ఇందులో కొంచెం అడల్ట్ టచ్ ఉన్న కామెడీ ఉంటుంది. మెచ్యూర్డ్ ఆడియన్స్ ఆ కామెడీని బాగానే రిసీవ్ చేసుకోవచ్చు కానీ.. సగటు ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకుని సెన్సార్ వాళ్లు ఏమైనా అభ్యంతరాలు వ్యక్తం చేయొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కట్స్ చెబుతారేమో.. లేదంటే ?ఎ? రేటింగ్ ఇస్తారేమో అనుకున్నారు. కానీ సెన్సార్ వాళ్లు అలాంటి అడ్డంకులేమీ సృష్టించలేదు. పెద్దగా కట్స్ ఏమీ లేకుండానే ఈ సినిమాకు ?యు/ఎ? సర్టిఫికెట్ ఇచ్చి సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేశారు. ప్రేక్షకుల అభిరుచి మారుతున్న నేపథ్యంలో ఇలాంటి మెచ్యూర్డ్ మూవీస్ కు ప్రోత్సాహం ఇవ్వడం అన్నది మంచి పరిణామం. ఇప్పుడు జనాలు చాలా విషయాలపై ఓపెన్ గా ఉంటున్నారు. సెక్స్.. స్పెర్మ్ లాంటి మాటలు మాట్లాడ్డానికి.. ఓపెన్ గా డిస్కషన్లు పెట్టడానికి వెనుకాడట్లేదు. ఇలాంటి విషయాల్లో బహిరంగ చర్చలు చాలా అవసరం. ఈ నేపథ్యంలో ?నరుడా డోనరుడా? లాంటి సినిమాలు రావడమూ మంచిదే.

,  ,  ,