Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-May-2016 08:49:10
facebook Twitter Googleplus
Photo

మనం సినిమాతో ప్రతీ తెలుగు ప్రేక్షకుడి మన్ననలను అందుకున్న విక్రమ్ కుమార్ ఇప్పుడు 24 చిత్రంతో తెలుగుతో పాటూ తమిళనాట కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇతని గత రెండు చిత్రాలకు ఇప్పుడు హిందీలో భారీ గిరాకీ వుండడం విశేషం.

ఈ సినిమాలను హిందీలో రీమేక్ చెయ్యాలని దాన్ని విక్రమే డైరెక్ట్ చెయ్యాలని పెద్ద పెద్ద సంస్థలు కోరుతున్నా చెప్పిన కధనే మరోసారి చెప్పడంకోసం కాలాన్ని వృధా చెయ్యడం తనకి ఇష్టంలేక ఈ రిక్వెస్ట్ లను హోల్డ్ లో పెట్టాడట.

తన సినిమా కధలు పేపర్ మీద ఎంతో కష్టంగా వున్నా తెరకెక్కించే సరికి సామాన్య ప్రేక్షకుడికి కూడా చాలా సులువుగా అర్ధమవుతాయి. ఈ విషయంలో దర్శకుడు స్పందిస్తూ మనం చేసే సినిమాలు మన ఇంటిలిజెన్స్ ని తెలపకూడదని దాని వెనుక దాగున్న ఎమోషన్లను తెలపాలని జవాబిచ్చాడు. ఈ పంచ్ టాలీవుడ్ లో మోస్ట్ ఇంటిలిజెంట్ అండ్ క్రియేటివ్ డైరెక్టర్ గా పేరొంది గత రెండు సినిమాలు ఆశించినంత విజయాన్ని సాధించని దర్శకుడిమీద వేసిందేనని అందరూ చెవులు కొరుక్కుంటున్నారు. ఆ పేరేంటో మేము ప్రస్తావించక్కర్లేదు అనుకుంటగా

,  ,  ,  ,