Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

31-May-2016 10:53:09
facebook Twitter Googleplus
Photo

తన సమకాలీనుల్నయినా.. తనకంటే చిన్నవాళ్లనయినా గారూ అనే సంబోధిస్తుంటాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తన వీరాభిమాని అయిన నితిన్ ను కూడా అలాగే గౌరవించాడు. ??ఆల్ ద బెస్ట్ నితిన్ గారూ?? అంటూ బ్రాకెట్లో ?అఆ? అని రాసి.. దాని కింద ??బెస్ట్ విషెస్ ఫ్రం పవన్ కళ్యాణ్?? అని కూడా పేర్కొన్నాడు పవన్. ఇదంతా ఈ విషెస్ ఏ రూపంలో చెప్పాడో చెప్పలేదు కదా. ప్రతి సంవత్సరం పవన్ తన తోటలో పండిన మామిడి పండ్లను తన సన్నిహితులకు బహుమతిగా పంపిస్తాడన్న సంగతి తెలిసిందే. ఈసారి కూడా నితిన్ కు పండ్ల బుట్ట పంపించి దాని మీద ఇలా పేర్కొన్నాడు.

ఈసారి పంట సరిగా లేదని.. అందుకే ఎక్కువమందికి పండ్లు పంపలేనేమో అని ఆ మధ్య ఇంటర్వ్యూలో అన్నాడు కానీ.. ఇలాంటి స్థితిలోనూ నితిన్ కు మాత్రం పండ్లు పంపకుండా ఆపలేదు. ట్విట్టర్లో పవన్ తనకు పంపిన పండ్ల బుట్ట ఫొటో షేర్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నాడు నితిన్. ??థ్యాంక్ యు సర్.. ఇది నాకు చాలా పెద్ద విషయం?? అని ట్వీట్ చేశాడు పవన్ ఫ్యాన్. గత ఏడాది కూడా నితిన్ పవన్ మ్యాంగోస్ తినే అదృష్టం దక్కించుకున్నాడు. నితిన్ కు పండ్లు చేరాయంటే మిగతా వాళ్లకు కూడా పార్శిల్స్ వెళ్లే ఉంటాయి. ఇక ఒక్కొక్కరుగా ఈ విశేషాల్ని ట్విట్టర్లో షేర్ చేసుకుంటార్లెండి.

,  ,  ,  ,  ,  ,  ,