Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-May-2016 13:16:17
facebook Twitter Googleplus
Photo

తెలుగు సినిమాల్లో విలన్ గా మంచి ఆఫర్లను అందుకుంటున్నాడు విక్రమ్ జీత్ విర్క్. ఎన్టీఆర్ బాద్ షాతో మొదలుపెట్టి నితిన్ హార్ట్ ఎటాక్ - సునీల్ భీమవరం బుల్లోడు - కళ్యాణ్ రామ్ షేర్ - బాలయ్య డిక్టేటర్ లతో పాటు.. మధ్యలో చారిత్రక చిత్రమైన రుద్రమదేవిలో కూడా కీలక పాత్ర పోషించాడు విక్రమ్.

బాలయ్య సినిమాలో చేసిన తర్వాత ఈ విలన్ కి ఓ ఇంటర్నేషనల్ మూవీలో ఆఫర్ వచ్చింది. బాలకృష్ణ సినిమాతో సంబంధం ఏంటని అనిపించచ్చు కానీ ఇది నిజమే. డిక్టేటర్ లో విక్కీ భాయ్ గా ఇతని గెటప్ అందరినీ ఆకట్టుకుంది. ఇది ఓ ఇండో చైనీస్ ఫిలిం మేకర్స్ ను కూడా అట్రాక్ట్ చేసింది. నాలుగేళ్ల క్రితం వచ్చిన లాస్ట్ ఇన్ థాయ్ లాండ్ చిత్రానికి సీక్వెల్ ను ప్లాన్ చేసుకున్నాడు దర్శకుడు వాంగ్ బకియంగ్.

మెయిన్ విలన్ గా నటించేందుకు పర్ఫెక్ట్ ఫేస్ ను వెతుకుతున్న సమయంలో విక్రమ్ జీత్ విర్క్ గురించి తెలిసి అప్రోచ్ అయ్యారట. 'ఈ సినిమాకోసం కాస్టింగ్ కాల్ కి వెళ్లినపుడు.. నేను షార్ట్ హెయిర్ - పొడుగు గడ్డంతో ఉన్నాను. నన్ను చూడగానే కాస్టింగ్ డైరెక్టర్ నువ్వు అచ్చమైన రాక్షసరాజులా ఉన్నావ్ అన్నాడు. అలా ఈ 'బడ్డీస్ ఇన్ ఇండియా' అనే ఇండో చైనీస్ ఫిలింలో భాగం అయ్యాను' అని చెప్పాడు విక్రమ్ జీత్ విర్క్

,  ,  ,  ,  ,