Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-May-2015 11:28:32
facebook Twitter Googleplus
Photo

అసలే మహేష్ బాబు ... అతనికి సక్సెస్ ఫుల్ దర్శకుడు కొరటాల శివ తోడయ్యాడు. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రానికి యమా క్రేజ్ అందుకుంది. దీంతో ఈ చిత్రం శాటిలైట్ హక్కులు హాట్ కేక్ లా అమ్ముడుపోయాయి. 'జీ తెలుగు' ఎంటర్ టైన్మెంట్ చానెల్ ఈ హక్కులను 11.5 కోట్లకు సొంతం చేసుకున్నట్టు తాజా సమాచారం. మహేష్ గత సినిమా 'ఆగడు' శాటిలైట్ రైట్స్ 9.75 కోట్లకు వెళ్లిన సంగతి మనకు తెలిసిందే. ఆ విధంగా చూస్తే, మహేష్ సినిమాల బిజినెస్ విషయంలో భారీ పెరుగుదల కనిపిస్తుంది. కాగా, ఈ చిత్రానికి 'శ్రీమంతుడు' టైటిల్ ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులో మహేష్ సరసన శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది.

,  ,  ,  ,  ,  ,  ,  ,  ,