Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Feb-2017 15:47:34
facebook Twitter Googleplus
Photo

హీరోయిన్లతో పాటు విలన్లను కూడా ముంబయి నుంచి దిగుమతి చేసుకోవడం మన దర్శక నిర్మాతలకు అలవాటు. ఇప్పటికే చాలామంది ముంబయి విలన్లు తెలుగు సినిమాల్లో కనిపించారు. ఇప్పుడు మరో బాలీవుడ్ నటుడు తెలుగులో అరంగేట్రం చేయబోతున్నాడు. అతడి పేరు.. వివాన్ భాటేనా. మాస్ రాజా రవితేజ హీరోగా పటాస్.. సుప్రీమ్ సినిమాల దర్శకుడు అనిల్ రావిపూడి తీయబోతున్న ?రాజా ది గ్రేట్?లో వివాన్ విలన్ పాత్ర పోషించబోతున్నాడు. 38 ఏళ్ల వివాన్.. ముందు సీరియళ్ల ద్వారా పేరు సంపాదించాడు. ఆపై సినిమాల్లోకి అరంగేట్రం చేశాడు. షారుఖ్ మూవీ చక్ దె ఇండియా.. అమీర్ సినిమా తలాష్.. ఇంకా కొన్ని క్రేజీ ప్రాజెక్టుల్లో నటించి మెప్పించాడు.

రాజా ది గ్రేట్ లో ఓ విలక్షణమైన విలన్ పాత్ర కోసం వివాన్ ను ఏరికోరి ఎంచుకున్నాడు అనిల్ రావిపూడి. అనిల్ తొలి రెండు సినిమాల్లోనూ బాలీవుడ్ వాళ్లే విలన్ పాత్రలు చేశారు. ?పటాస్?లో అశుతోష్ రాణా విలన్ అయితే.. ?సుప్రీమ్?లో కబీర్ సింగ్ ప్రతినాయక పాత్రను పోషించాడు. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కబోయే రాజా ది గ్రేట్ లో మాస్ రాజా అంధుడి పాత్రను పోషించబోతుండటం విశేషం. అనిల్ లాంటి కమర్షియల్ డైరెక్టర్.. రవితేజ లాంటి మాస్ హీరోతో అంధుడి పాత్రను చేయించడం విశేషమే. ఐతే హీరో అంధుడైనా ఇది పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అంటున్నారు. చూద్దాం అనిల్ అందించే వినోదం ఎలా ఉంటుందో?

,  ,  ,  ,  ,  ,