హీరోలు కానీ హీరోయిన్లు కానీ పెళ్లిలు అయితే వాళ్ళ ఇంటిలో పెళ్లి అయినంతగా ఆనందపడిపోతారు మన అభిమానులు. నిజమే ఒక సారి ఒక నటిని గాని నటుడును గాని మన వాళ్ళు ఇష్టపడితే ఇక వాళ్ళు పూర్తిగా తెర మరుగున పడినంత వరకు వాళ్ళని అభిమానిస్తూనే ఉంటారు. సౌత్ ఇండియా లో మన స్టార్ పెళ్లిళ్లు మహా వైభవంగా జరుగుతాయి అని మీకు కూడా తెలుసు కదా. అయితే ఇక్కడ ఒక హీరోయిన్ మాత్రం అలా ఆడంబరం ఏమి లేకుండా రిజిస్టర్ పెళ్లి చేసుకోబోతుంది.
‘పెళ్ళైన కొత్తలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులు దగ్గరైన ప్రియమణి ఇప్పుడు తెలుగులో ఏమి సినిమాలు చేయకపోయినా కొన్నేళ్ళ కిందట వరకు మంచి బిజీ హీరోయిన్ అనే చెప్పాలి. సౌత్ ఇండియాలో అన్ని ఇండస్ట్రిలోనూ పని చేసిన అనుభవం ఉంది ఈమెకు. కొద్ది కాలం కిందట ప్రియమణికి తన చిరకాల బోయ్ ఫ్రెండ్ ముస్తాఫా రాజ్ తో పెళ్లి నిచ్చితార్ధం జరిగిన విషయం తెలిసిందే కదా ఇప్పుడు పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఆగష్టు 23 నాడు వీళ్ళ ఇద్దరు రిజిస్టర్ ఆఫీసు లో పెళ్లి చేసుకోబోతున్నారు. పెళ్లి తరువాత అంటే 24వ తేదిన బెంగళూరులో ఇండస్ట్రి పెద్దలును తన తోటి నటీనటులను పిలిచి విందు ఇవ్వబోతుంది అమ్మడు.
ప్రియమణి ఇప్పుడు కొన్ని కన్నడ సినిమాలతో కొంచెం బిజీ గా ఉంది. ఈ సినిమాలతో పాటుగా ఒక తెలుగు టివి చానల్ లో డాన్స్ షో కి జడ్జ్ గా చేస్తుంది. ప్రియమణి ఒక ఇంటి కోడలు అవ్వడంతో ఆమె అభిమానులకు చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారు.