Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Oct-2017 10:28:35
facebook Twitter Googleplus
Photo

మన తారలు సినిమా ప్రమోషన్స్ కోసం ఇతర రియాల్టీ షోలను టాక్ షోలను బాగా యూస్ చేసుకుంటున్నారు. సినిమా అయిపోగానే ఏ మాత్రం తీరిక లేకుండా ఎక్కడైనా ప్రమోషన్ ని నిర్వహించేందుకు సాయి అంటున్నారు. రీసెంట్ గా రామ్ కూడా ఒక టాక్ షోకి వెళ్లి అక్కడ తన ఇద్దరి హీరోయిన్స్ తో హంగామా చేసి షోకే హైప్ క్రియేట్ చేశాడు.

రామ్ ఇటీవల కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఉన్నది ఒకటే జిందగీ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. సినిమా మరికొన్ని రోజుల్లో రిలీజ్ కాబోతోంది. అయితే ఆ సినిమాతో మళ్లీ హిట్ అందుకోవాలని రామ్ ప్రమోషన్ ని బాగానే చేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రముఖ ఛానెల్ లోని ఒక టాక్ షోకి వెళ్లాడు. చిత్ర హీరోయిన్స్ లావణ్యా త్రిపాఠి - అనుపమ పరమేశ్వరన్ కూడా వచ్చారు.

అయితే ఈ షోలో రామ్ కి ఒక ప్రశ్న ఎదురైంది. ఇంటర్వ్యూ చేయాలంటే ఎవరి చేస్తారంటే.. బాలయ్య ను చేస్తానని చెప్పడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ క్లిప్పింగ్ వీడియో వైరల్ అయ్యింది. ఇక షో చివరలో హీరోయిన్స్ రామ్ వీపుపై రెండు ఇచ్చారు. దెబ్బలు కాదులెండి!. షోలో భాగంగా సెలబ్రెటీలు వారి చేతి గుర్తులను ఒక పేపర్ పై వేస్తారు.

,  ,  ,  ,