Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Mar-2017 17:56:13
facebook Twitter Googleplus
Photo

అదిగో మన మెగా హీరో సాయిధరమ్ తేజ్ అదే పని చేశాడు. అసలు రకుల్ ప్రీత్ తో ప్రేమాయణం సాగిస్తున్నావ్ అంటూ రూమర్లు వస్తున్నాయిగా నాయనా అంటే.. అబ్బే మీకు తెలియని మ్యాటర్ ఇంకోటి ఉంది అంటూ మెలికలు తిరిగిపోయాడు.

ఆ తిక్క సినిమా ఫ్లాపైనప్పటికీ.. షూటింగ్ సమయంలో హీరోయిన్ లారిస్సా బొనేసితో మనోడు ప్రేమలో పడిపోయాడట. ఏకంగా ఆమెకు ప్రపోజ్ కూడా చేశాడట. అయితే అప్పటికే ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పడంతో మనోడు నిరాశ చెందాల్సి వచ్చిందట. ఈ మాటలు చెబుతున్నప్పుడు సాయిధరమ్ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే.. వామ్మో.. ఆ బ్రెజిల్ పిల్ల ఇక్కడ లేదు కాబట్టి కహానీలు బాగానే అల్లేస్తున్నాడని మనం అనుకోవచ్చు.

అప్పట్లో రెజీనా.. ఆ తరువాత రకుల్ ప్రీత్ తో సాయిధరమ్ కు లింకప్ రూమర్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వాటి గురించి చెప్పు రాజా అంటే మనోడు బ్రెజిల్ పిల్ల గురించి చెబుతున్నాడు.

,  ,  ,  ,  ,