Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Oct-2016 16:43:08
facebook Twitter Googleplus
Photo

విడుదలకు ఆరు నెలలకు పైగా వ్యవధి ఉండగానే ?బాహుబలి: ది కంక్లూజన్? ప్రమోషన్ సందడి మొదలైపోయింది. ఈ నెల ఆరంభంలో ?బాహుబలి-2? లోగోను రివీల్ చేసింది రాజమౌళి అండ్ కో. ఇక మరో ఐదు రోజుల్లోనే అసలు హంగామా మొదలవుతుంది. ?బాహుబలి: ది కంక్లూజన్? ఫస్ట్ లుక్ ఈ నెల 23న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. రోజులు దగ్గరపడుతుండటంతో చాలా ఉత్కంఠగా ఫస్ట్ లుక్ కోసం ఎదురు చూస్తున్నారు ?బాహుబలి? ప్రియులు. ఐతే ఈ ఫస్ట్ లుక్ లాంచ్ కోసం కూడా ఏర్పాట్లు భారీగానే జరుగుతున్నట్లు సమాచారం.

లోగో రిలీజ్ హైదరాబాద్ లో ఓ చిన్న ప్రెస్ మీట్ పెట్టి కానిచ్చేశారు కానీ.. ఫస్ట్ లుక్ కోసం మాత్రం ముంబయిని వేదికగా ఎంచుకున్నాడు రాజమౌళి. ప్రస్తుతం ముంబయి ఫిలిం ఫెస్టివల్ వైభవంగా జరుగుతోంది. ఫిలిం సెలెబ్రెటీలతో ముంబయి నగరం కళకళలాడుతోంది. అదే వేడుకలో ?బాహుబలి: ది కంక్లూజన్? ఫస్ట్ రిలీజ్ చేస్తే మంచి ప్రచారం దక్కుతుందని భావించారు దర్శక నిర్మాతలు. బాహుబలి హిందీ సమర్పకుడు కరణ్ జోహార్ తో పాటు బాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో ?ది కంక్లూజన్? ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు. రాజమౌళి.. ప్రభాస్.. రానా సహా యూనిట్లోకి కీలక సభ్యలుందరూ ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ సందర్భంగానే ?బాహుబలి: ది కంక్లూజన్? మేకింగ్ కు సంబందించి వర్చువల్ రియాలిటీ వీడియో కూడా రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే.

,  ,  ,  ,  ,  ,