నిహారిక.. స్టార్ హీరోల వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఎక్కువగా హీరోలు మాత్రమే ఎంట్రీ ఇచ్చే తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చేస్తోన్న మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ మెంబర్. ?మెగా ఫ్యామిలీ? అన్న బ్రాండ్ వల్ల నిహారిక నటించిన ?ఒక మనసు? అనే సినిమా కొద్దిరోజులుగా బాగా వార్తల్లో నిలుస్తూ వస్తోంది. నాగ శౌర్య, నిహారిక హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సందర్భంగా నిహారిక ప్రమోషన్స్‌తో సినిమాకు మంచి క్రేజ్ తీసుకొస్తున్నారు.
ఇక ప్రమోషన్స్‌లో భాగంగానే, ?సినిమాల్లోకి రావాలని డిసైట్ అవ్వగానే, ఇంట్లో వాళ్ళను సంప్రదించా. అందరూ ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో, హీరోయిన్స్‌ని కొందరు ఎలా చూస్తారో చెప్పారు. అయితే నా విషయంలో యాక్టింగ్ పరంగా నా కమిట్మెంట్ ఏంటో చెప్పా. అప్పుడు చిరంజీవి పెదనాన్న, కళ్యాణ్ బాబాయ్ ఇష్టంగా చేస్తే ఎందులోనైనా విజయం సాధించవచ్చని, నెగటివిటీని పక్కనపెట్టి జాగ్రత్తగా సినిమాలు, పాత్రలు ఎంపిక చేసుకోమని సలహా ఇచ్చారు. వాళ్ళిచ్చిన సపోర్ట్‌ను ఎప్పటికీ నిలుపుకుంటూ మంచి సినిమాలు చేస్తా? అని తెలిపారు. రామరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఒక మనసు సినిమాను మధుర శ్రీధర్ నిర్మించారు.