Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Feb-2017 17:34:36
facebook Twitter Googleplus
Photo

ఈ నెలలో విడుదలవుతున్న సినిమాల్లో మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన విన్నర్ కూడా ఒకటి. షూటింగ్ తో సహా అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రమోషన్ల హడావుడిలో ఉంది. అందుకే ఆడియో కార్యక్రమం కూడా నిర్వహించకుండా ఒక్కో పాటను ఒక్కో స్టార్ చేత విడుదల చేయిస్తూ రోజూ సోషల్ మీడియాలో చర్చకు వస్తూ అనుకున్న స్పందనను రాబట్టుకుంటోంది.
అలాగే ప్రస్తుతం ట్రెండ్ గా మారిన ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ను కూడా ధరమ్ తేజ్ కాసేపటి క్రితమే అనౌన్స్ చేశారు. గతంలో బన్నీ సరైనోడు, చరణ్ ధృవ, చిరు ఖైదీ నెం 150 సినిమాలు ఇలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకుని ఘన విజయాలు సాధించడంతో మెగా హీరోలకి ఇదొక ఆనవాయితీగా మారి ఇప్పుడు ధరమ్ తేజ్ కూడా ఫాలో అవుతాడు. ఈ ఈవెంట్ ఆదివారం 19న గ్రాండ్ గా హైదరాబాద్లో జరగనుంది. అనంతరం 24న సినిమా రిలీజ్ కానుంది.

,  ,  ,  ,  ,