Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-May-2015 11:48:03
facebook Twitter Googleplus
Photo

జయాపజయాలతో సంబంధం లేకుండా మహేష్ బాబు కెరీర్ సాగిపోతోంది. వెనుక అపజయాలున్నా, ఎప్పటికప్పుడు కొత్త సినిమా బిజినెస్ మాత్రం రికార్డు స్థాయిలోనే జరుగుతోంది. తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న 'శ్రీమంతుడు' సినిమా విషయంలో కూడా అదే జరుగుతోంది. సినిమా నిర్మాణం దాదాపు పూర్తి కావస్తుండడంతో అన్ని ఏరియాలకు బిజినెస్ బాగా జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం శాటిలైట్ హక్కులకు కూడా విపరీతమైన పోటీ ఏర్పడింది. దీంతో 'జీ' టీవీ భారీ రేటు చెల్లించి ఈ హక్కులను సొంతం చేసుకుంది. అయితే, ఆ ఫిగర్ ఎంతన్నది మాత్రం ఇంకా స్పష్టంగా వెల్లడికాలేదు. ఈ నెల 31న సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా 'శ్రీమంతుడు' ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,  ,  ,