Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Sep-2016 11:17:14
facebook Twitter Googleplus
Photo

కాస్త వయసొచ్చిన హీరోయిన్స్ కి సంబందించిన గాసిప్స్ లో పెళ్లి ప్రధాన పాత్ర పోషిస్తుంటుంది. ఇక 28 - 30 ఏళ్లు దాటితే కచ్చితంగా ఆ విషయంపై అప్పటికే ఎవరితోనో డేటింగ్ లో ఉందనో లేక పెళ్లికి రెడీ అనో అదీ కాకపోతే పెళ్లి సంబందాలు చూస్తున్నారనో రకరకాల గాసిప్పులు ఫుంకాను ఫుంకాలుగా వచ్చిపడుతుంటాయి. అయితే ఇదే లిస్ట్ లో ఇప్పటికే చేరిన కాజల్.. తన పెళ్లి గురించి వస్తున్న గాసిప్స్ కు చెక్ పెట్టాలని నిర్ణయించుకుంది. దాంట్లో భాగంగానే.. తన పెళ్లి కి సంబందించిన కీలక విషయాన్ని చెప్పింది.

కాజల్ పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందనీ మొన్నామధ్య వార్తలు హల్ చల్ చేశాయి. తన చెల్లెలిని చూసి పెళ్ళి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చిందని కూడా పుకార్లు వినిపించాయి. అయితే తాజాగా వాటన్నింటికీ కాజల్ చెక్ పెట్టేసింది. మరో రెండు సంవత్సరాల వరకూ తాను పెళ్లి చేసుకోవడం లేదని తేల్చేసింది. మరో రెండేళ్లు తనని వదిలేయమనీ ఆ తరువాతే పెళ్ళి చేసుకుంటాననీ ఇప్పటికే తల్లిదండ్రులకి తేల్చి చెప్పేసిందట! అదే విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది కాజల్!

ఈ లెక్కన చూసుకుంటె.. కాజల్ మరో రెండేళ్ల తర్వాత "శ్రీమతి కాజల్" అయిపోతుందన్నమాట. ఆ విషయంలో వాస్తవం ఎంతుందో తెలియదు కానీ ప్రస్తుతానికి మాత్రం తన పెళ్ళి వార్తల ఊహాగానాలను నిలిపివేయమంటూ పరోక్షంగా హెచ్చరిక చేసిందని టాలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు.

,  ,  ,  ,  ,  ,