Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Feb-2017 10:53:21
facebook Twitter Googleplus
Photo

ప్రియాంక చోప్రా ఇప్పుడు బాలీవుడ్ లోనే కాదు.. హాలీవుడ్ లో కూడా వెలిగిపోతోంది. క్వాంటికో సీరియల్ తో మొదలుపెట్టి.. బేవాచ్ అంటూ హాలీవుడ్ మూవీలో నెగిటివ్ రోల్ చేసే వరకూ ఎదిగిపోయింది. దాదాపు హాలీవుడ్ లోనే మకాం వేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం.

కానీ 15 ఏళ్ల క్రితం ప్రియాంక ఎలా ఉందో చూస్తే మైండ్ బ్లాంక్ అవాల్సిందే. 2001లో ఫిలింఫేర్ ఫోటో షూట్ చేసినప్పుడు ప్రియాంక చోప్రా ఫోటో ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. నునుపైన దేహంతో.. అతి సన్నగా ఉండడమే కాదు.. దాదాపు జీరో సైజ్ లో కనిపించేస్తోంది ప్రియాంక. అంతే కాదు.. అప్పట్లో అమ్మడి స్టైలింగ్ ఏరేంజ్ లో ఉందో చూడండి.. నడుంభాగం అంతా ఎక్స్ పోజ్ చేసేస్తోంది. డెనిమ్ బాటమ్ తో పాటు.. సిల్వర్ కలర్ టాప్ వేయడం.. స్లీవ్ లెస్ స్ట్రాప్ లెస్ టాప్ కావడంతో.. ప్రియాంక లేలేత అందాలు మెరిసిపోతున్నాయి.

ఇప్పుడు మొహంలో మెచ్యూరిటీ కనిపిస్తుంటే.. అప్పుడు అమాయకత్వంతో పాటు.. అసలైన ఆకర్షణ అమ్మడి మొహంలో తొణికిసలాడుతోంది. ఇక హాలీవుడ్ లో సెటిల్ అవడం తన ఉద్దేశ్యం కాదని చెబుతోంది కానీ.. అమ్మడి బిహేవియర్ అలా కనిపించడం లేదు.

,  ,  ,  ,  ,