Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Jan-2016 18:02:08
facebook Twitter Googleplus
Photo

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు. రీసెంట్ గా ఓ పోస్టర్ విడుదల చేసినా.. అది ఫస్ట్ లుక్ కాదు అందులో టైటిల్ కూడా లేదు. మరిప్పుడు సంక్రాంతికి రిలీజ్ కానున్న ఫస్ట్ లుక్ నాటికి టైటిల్ అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది.

అయితే.. ఈ చిత్రానికి సరైనోడు అనేది వర్కింగ్ టైటిల్. ఇదే ఫైనల్ అని కాదనీ చాలానే వార్తలొచ్చాయి. దీనిపై బన్నీ గానీ బోయపాటి కానీ క్లారిటీ ఇవ్వలేదు. అయితే.. దీని తర్వాత మొదలైనా.. ఇలాంటి టైటిల్ తోనే ఓ సినిమా వచ్చేస్తోంది. స్పీడున్నోడు పేరుతో అల్లుడు శీను ఫేం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఓ మూవీ సిద్ధమవుతోంది. ఇప్పటికే స్పీడున్నోడు టైటిల్ తో సహా ఫస్ట్ లుక్ కూడా ఇచ్చేశారు. లేట్ గా మొదలుపెట్టినా.. ఈ కుర్రోడు బాగా స్పీడ్ గానే అనౌన్స్ చేసేశాడు. దీంతో ఇప్పుడు అల్లు అర్జున్ సరైనోడు టైటిల్ ప్రకటించడం కష్టం అంటున్నారు. ముందుగా ఫస్ట్ లుక్ ఇచ్చి ఉంటే వేరే.. ఇప్పుడు స్పీడున్నోడు వచ్చేశాక సరైనోడు అనే టైటిల్ ని జనాల్లోకి వెళ్లడం రాంగ్ సిగ్నల్స్ ఇస్తుందని భావిస్తున్నారట.

అందుకే టైటిల్ విషయంలో మార్చి తీరాలని బన్నీ పట్టు పడుతున్నాడని టాక్. ఇప్పటికే బోయపాటి దగ్గర రెండు పవర్ ఫుల్ టైటిల్స్ ఉన్నాయని.. వీటిలో ఏదో ఒకటి ఫస్ట్ లుక్ నాటికి ఫైనల్ చేసి అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది. ఈ మూవీలో బన్నీ సరసన రకుల్ ప్రీత్ సింగ్ - కేథరిన్ థెరెసాలు హీరోయిన్ లు గా నటిస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,  ,