Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Jul-2017 16:00:53
facebook Twitter Googleplus
Photo

మార్క్ డైలాగులతో ప్రేక్షకులను మెప్పించే క్యారక్టర్ ఆర్టిస్ట్ ఫిష్ వెంకట్. అనేక సినిమాల్లో విలన్ పక్కన చిన్న చిన్న వేషాల్లో వెంకట్ కనిపిస్తుంటాడు. రీల్ లైఫ్ లో తాగి రచ్చ చేసే సన్నివేశాల్లో నటించినట్లు రియల్ లైఫ్ లోనూ మందు కొట్టి చిందులు వేశాడు. దీంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు.

భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో నివాసముండే తన కుమార్తె ఇంటికి ఫిష్ వెంకట్ వెళ్లాడు. తన కుమార్తె పక్కింట్లో నివాసం ఉంటున్న వేముల ప్రసాద్ - ఉపేంద్ర - రాజేశ్ లపై ఫిష్ వెంకట్ అర్ధరాత్రి దాడి చేయబోయాడు. దీంతో వారు భద్రాద్రి జిల్లా పోలీసు స్టేషన్లో ఫిష్ వెంకట్ పై ఫిర్యాదు చేశారు.

దీంతో పోలీసులు ఫిష్ వెంకట్ పై కేసు నమోదు చేశారు. ఫిష్ వెంకట్ గతంలో కూడా ఫిర్యాదుదారులపై దురుసుగా ప్రవర్తించిన ఘటనలున్నాయి. ఇంతకుముందు కూడా కొంతమంది మనుషులతో వచ్చి వారి కుటుంబంపై దాడికి ప్రయత్నం చేసినట్టు వారు తెలిపారు.

,  ,  ,  ,  ,