రామ్ గోపాల్ వర్మ కొన్ని రోజులుగా వివాదాల ట్వీట్స్ విషయంలో సైలైంట్ గా ఉన్నాడు. అయితే.. బ్యూటీ అండ్ అగ్లీ అంటు.. తను-రాజమౌళి కలిసి దిగిన ఫోటోను వర్మ ట్వీట్ చేస్తే..అయ్యా నన్ను ఒగ్గేయండయ్యా అంటూ సైలెంట్ గా దీన్నుంచి తప్పుకున్నాడు రాజమౌళి.
కానీ సంచలన ట్వీట్స్ పెట్టే మరో బాలీవుడ్ పర్సనాలిటీ కమల్ ఆర్ ఖాన్.. ఇందులో తలదూర్చాడు. మీరిద్దరూ అద్భుతమైన డైరెక్టర్లే కానీ.. ఇద్దరూ అగ్లీగానే ఉంటారు. 2 రుపీస్ పీపుల్.. ఎంజాయ్ చేయండి అంటూ ట్వీట్ పెట్టాడు కమల్ ఆర్ ఖాన్. అయితే.. వర్మకి ఇలాంటివి వాటిని ఫేస్ చేయడం కొట్టిన పిండి. అందుకే వెంటనే దీనికి రిప్లై ఇస్తూ.. బాగా చెప్పారు.. అందరూ మీ లాగా.. షారూక్ లాగా అందంగా ఉండరు కదా అంటూ ట్వీట్ చేశాడు వర్మ.
అక్కడితో ఆగిపోతే అది రాంగోపాల్ వర్మ స్టైల్ కాదు కదా. అందుకే అక్కడి నుంచే బ్యూటీ అగ్లీ.. ఈ రెండు పదాలను ఉపయోగిస్తూ.. సుదీర్ఘమైన ట్వీట్ పెట్టి కన్ఫ్యూజ్ పారేశాడు.