Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-May-2016 09:47:37
facebook Twitter Googleplus
Photo

సౌందర్య తరువాత అంతటి ప్రతిభ గల నటిగా పేరు తెచ్చుకున్న నిత్యా మీనన్ ప్రస్తుతం సందీప్ కిషన్ సరసన ?ఒక అమ్మాయి తప్ప? సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం బెంగుళూరు లోని అబ్బయ్య నాయుడు స్టూడియో లో డబ్బింగ్ జరుపుకుంటున్నట్లు తెలిసింది. ఇటీవల నటి నిత్యా మీనన్ తన డబ్బింగ్ ని పూర్తి చేశారు. త్వరలో ఈ సినిమా సెన్సార్ తేదీని, సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.
నూతన దర్శకుడు రాజ‌సింహ తాడినాడ దర్శకత్వంలో పూర్తి స్థాయి ఎంటర్ టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకి All Indians are My Brothers and Sisters? అనేది ఉపశీర్షిక. ఈ సినిమాలో దాదాపు గంటకు పైగా హై ఎండ్ గ్రాఫిక్స్ ఉన్నట్లు సమాచారం. ప్రముఖ సీనియర్ ఛాయాగ్రాహకుడు చోటా కె నాయుడు ఛాయాగ్రహణం సమకూర్చగా ఈ చిత్రాన్ని బోగాది అంజిరెడ్డి నిర్మిస్తున్నారు. మిక్కీ జె మేయర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

,  ,  ,  ,  ,