Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Mar-2017 16:09:24
facebook Twitter Googleplus
Photo

మనోజ్ కెరీర్ సక్సెస్ ట్రాక్ ఎక్కడానికి చాలా టైం పట్టింది. ఐతే ఒకసారి సక్సెస్ అందుకున్నాక కొంచెం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశాడు. బిందాస్.. కరెంటు తీగ.. పోటుగాడు లాంటి సినిమాలు మనోజ్ కు మంచి ఫలితాల్నే ఇచ్చాయి. కానీ గత ఏడాది మళ్లీ అతను ట్రాక్ తప్పాడు. తక్కువ వ్యవధిలో అతడికి శౌర్య.. ఎటాక్ దారుణమైన అనుభవాల్ని మిగిల్చాయి. ఇప్పుడు అతడి ఆశలన్నీ గుంటూరోడు మీదే ఉన్నాయి. మనోజ్ నుంచి మాస్ ప్రేక్షకులు ఎలాంటి సినిమాను ఆశిస్తారో అలాగే ఉండేలా కనిపిస్తోంది గుంటూరోడు. ఐతే సరైన టైమింగ్ లో ఈ సినిమా రిలీజ్ కావట్లేదన్నదే మనోజ్ అభిమానుల బాధ.

మార్చి అంటే మామూలుగానే సినిమాలకు అంత కలిసొచ్చే నెల కాదు. పరీక్షల సీజన్ కావడంతో స్టూడెంట్స్ సినిమాలకు రావడం తక్కువ. దీనికి తోడు మార్చి నెల మనోజ్ కు ఎప్పుడూ కలిసి రాలేదు. గతంలో మిస్టర్ నూకయ్య సినిమా మార్చి 8నే విడుదలైంది. మంచి అంచనాల మధ్య రిలీజైన ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఇక గత ఏడాది శౌర్య తీవ్రంగా నిరాశ పరిచింది. ఆ సినిమా మార్చి 5న ప్రేక్షకుల ముందుకొచ్చింది. గుంటూరోడు ఈ మార్చి సెంటిమెంటుకు చరమగీతం పాడుతుందని మనోజ్ నమ్మకంగా ఉన్నాడు. దీని టీజర్.. ట్రైలర్ చూస్తే మాస్ ప్రేక్షకులకు విందు భోజనం లాగే కనిపిస్తోంది. మినిమం గ్యారెంటీ మూవీలా అనిపిస్తోందిది. కాకపోతే అన్ సీజన్లో ఇంకో రెండు సినిమాలతో పోటీ పడాల్సి రావడమే ఈ చిత్రానికి ప్రతికూలంగా కనిపిస్తోంది.

,  ,  ,  ,  ,  ,