Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Jun-2017 12:27:26
facebook Twitter Googleplus
Photo

యంగ్ హీరో సందీప్ కిషన్ కెరీర్ ప్రారంభంలోనే మంచి సక్సెస్ లు అందుకుని ఆ తర్వాత స్లో అయిపోయాడు. ఇప్పుడు నక్షత్రం లాంటి క్రేజీ ప్రాజెక్ట్ ఫినిష్ చేసినా ఇంకా అది రిలీజ్ అయేందుకు ఆపసోపాలు పడుతోంది. ఇప్పటికే తమిళ్ ఇండస్ట్రీలో దాదాపు సెటిల్ అయిన సందీప్ కిషన్.. ద్విభాషా చిత్రాలతోనూ ఆడియన్స్ ను మెప్పించేందుకు ప్రయత్నిస్తున్నాడు.

ప్రస్తుతం సందీప్ కిషన్ నటిస్తున్న ఓ తమిళ్ మూవీక్ నరగసురన్ అనే టైటిల్ ను ఖాయం చేశారు. ఈ సినిమాలో సీనియర్ బ్యూటీ శ్రియ హీరోయిన్ కావడం విశేషం. హీరో హీరోయిన్స్ ఇద్దరికీ తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉండడంతో.. దీన్ని తెలుగులో కూడా విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. తెలుగులో ఈ చిత్రానికి 'నరకాసురుడు' అనే టైటిల్ ను ఖాయం చేయగా.. తాజాగా ఈ మూవీకి రెండు భాషలకు టైటిల్ పోస్టర్ ను విడుదల చేసింది యూనిట్. ఎ టేల్ ఆఫ్ ఫాలెన్ డెమాన్ అంటూ డిస్క్రిప్షన్ చూస్తే.. ఫ్యాంటసీ మూవీ అనే సంగతి అర్ధమవుతోంది.

నరకాసురుడు మూవీలో అరవింద్ స్వామి.. ఇంద్రజిత్ లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మొదటగా ఈ మూవీలో హీరోగా నాగచైతన్యను తీసుకోవాలని భావించినా.. చివరకు ఆ అవకాశం సందీప్ కిషన్ చేతికి వచ్చింది.

,  ,  ,  ,  ,