Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Jun-2017 14:39:27
facebook Twitter Googleplus
Photo

ప్రస్తుతం దెయ్యాల సినిమాలకు సీజన్ బాగానే నడుస్తోంది. కాసింత హారర్.. దానికి మరి కాసింత హ్యూమర్ మిక్స్ చేసి.. థియేటర్లలోకి వదలితే మినిమం గ్యారంటీ అయిపోయింది. ఈ రెండు ఎలిమెంట్స్ ను సరిగా మిక్స్ చేయగలిగితే హిట్ కొట్టేసినట్లే. రేపు రిలీజ్ కానున్న అంధగాడు మూవీ కూడా ఈ బాపతే అంటున్నారు.

ఇప్పటివరకూ ఈ మూవీ స్పెషాలిటీ.. యంగ్ హీరో రాజ్ తరుణ్ గుడ్డివాడి పాత్రను చేయడమే అనే ప్రచారమే జరిగింది. మొదటి 40 నిమిషాలు మాత్రమే తాను గుడ్డివాడిగా కనిపిస్తానని రాజ్ తరుణ్ రీసెంట్ గా చెప్పాడు కూడా. అయితే.. దీనికి మించిన థ్రిల్లింగ్ ఎలిమెంట్.. ఓ దెయ్యం పాత్ర. ఆ రోల్ ను రాజేంద్ర ప్రసాద్ తో చేయించారట. అయితే.. అన్ని సినిమాల మాదిరి దెయ్యం కాదని.. ఈ రాజేంద్ర ప్రసాద్ దెయ్యం సంథింగ్ డిఫరెంట్ గా ఉంటుందని అంటున్నారు. అంటే.. రియల్ గా సినిమాలో దెయ్యం ఉండదట.

రాజ్ తరుణ్ క్రియేట్ చేసిన ఓ వర్చువల్ రోల్ ఈ దెయ్యం పాత్ర కాగా.. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకూ ఈ దెయ్యం కనిపిస్తుందట. అలాగని రియల్ గా మాత్రం ఈ దెయ్యం ఉండదట. ఇదేదో డిఫరెంట్ గా ప్రయత్నించారని అనిపించడం ఖాయం.

,  ,  ,  ,  ,  ,