Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Aug-2015 13:56:11
facebook Twitter Googleplus
Photo

సత్యజిత్ రే మణిరత్నం శ్యాం బెనగల్ వంటి మహామహులెందరో దర్శకదిగ్గజాలుగా వెలిగిన నేల ఇది. భారతదేశానికి ప్రపంచ సినీయవనికపై గుర్తింపు తెచ్చిన అరుదైన దర్శకులు వీళ్లంతా. అంతర్జాతీయ సినిమా ఉత్సవాల్లో వీళ్ల సినిమాలకు విపరీతమైన గిరాకీ. అయితే ఈతరం దర్శకుల్లో ఎంతమంది వచ్చినా ఆ స్థాయి గుర్తింపు రాలేదన్న విమర్శ ఉంది. బాలీవుడ్ లో రాజ్ కుమార్ హీరాణీ లాంటి అరుదైన దర్శకులకు మాత్రమే అంత పేరొచ్చింది. మరి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి ఆ రేంజు దర్శకుడు అయినట్టేనా? బాహుబలితో అది సాధ్యమైనట్టేనా? అంటూ విశ్లేషణ మొదలెట్టారు.

అయితే రాజమౌళి కేవలం మాస్ డైరెక్టర్ మాత్రమే. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించే సత్తా ఉన్న దర్శకుడే కానీ విమర్శకులు మెచ్చే దర్శకుడు కాదని అంటున్నారు కొందరు. అతడు మాస్ కంటెంట్ ని సమర్థవంతంగా విజువలైజ్ చేయగలడు వసూళ్ల సునామీ సృష్టించగలడు కానీ క్లాసిక్స్ తీయలేడు.. అనేవారున్నారు. బాహుబలి 600కోట్ల క్లబ్ సినిమా. పీకే భజరంగి భాయిజాన్ తర్వాత టాప్ గ్రాసర్ గా నిలిచిన చిత్రమిది. అయినా రాజమౌళి స్థాయిని ఈ ఒక్క సినిమాతోనే పెంచేయలేం అని అంటున్నారు విశ్లేషకులు.

రాజమౌళి సినిమాల్లో ఉన్నదాన్ని పూర్తి కమర్షియల్ ఫార్మాట్ లో ఎగ్జాగరేట్ చేసి చూపిస్తాడు. బాహుబలిలోనూ అతడు చేసింది అదే. అది మాస్ కి బాగా కనెక్టయ్యింది. 300 ట్రాయ్ గ్లాడియేటర్ వంటి భారీ యాక్షన్ సినిమాల్లో ఉన్న సహజత్వంతో పోలిస్తే బాహుబలి విజువల్స్ కాస్త తక్కువేనన్న విమర్శ కూడా ఉంది. దీనికి రాజమౌళి సమాధానం ఏమిటో? బాహుబలి 2తో చెబుతాడేమో చూడాలి.

,  ,  ,  ,