Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Aug-2016 11:55:17
facebook Twitter Googleplus
Photo

తెలుగు, తమిళ, మళయాల భాషల్లో నటి నిత్యా మీనన్‌కు ఏ పాటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. నటిగా పలు అద్భుతమైన పాత్రలు చేసిన ఆమె, తాజాగా 100 డేస్ ఆఫ్ లవ్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించేందుకు వచ్చేస్తున్నారు. మళయాలంలో గతేడాది విడుదలై మంచి విజయం సాధించిన ఈ సినిమాను అదే పేరుతో ఇప్పటికి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. మళయాల స్టార్ హీరో, ఓకే బంగారం తో తెలుగు ప్రేక్షకులకూ దగ్గరైన దుల్కర్ సల్మాన్, ఈ సినిమాలో హీరోగా నటించారు.
అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 26న విడుదలవుతోంది. ఇక ఈ సందర్భంగానే సినిమా గురించి మాట్లాడుతూ, ఈ సినిమాలో తాను స్వయంగా ఓ పాట పాడానని నిత్యా మీనన్ తెలిపారు. హృదయం కన్నులతో? అంటూ సాగే ఈ పాట మేకింగ్‌ను విడుదల చేస్తూ తన పాటను, సినిమాను ఆదరిస్తారని కోరుకుంటున్నట్లు నిత్యా మీనన్ ఆశాభావం వ్యక్తం చేశారు. జెనస్ మొహమ్మద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో తన అభిమానులందరికీ బాగా నచ్చుతుందని నిత్యా ధీమా వ్యక్తం చేశారు

,  ,  ,  ,  ,  ,