Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-May-2016 15:30:29
facebook Twitter Googleplus
Photo

సూర్య.. రజనీ కాంత్, కమల్ హాసన్‌ల తర్వాత తెలుగు ప్రేక్షకులకు ఆ స్థాయిలో పరిచయమున్న హీరో. సూర్య అక్కడ చేసే సినిమాలన్నీ ఇక్కడా ఒకేసారి విడుదల కావడం కొన్ని సంవత్సరాలుగా సాంప్రదాయంగా మారిపోయింది. ఇక ఇప్పుడాయన హీరోగా నటించగా, తెలుగులో దర్శకుడిగా తనదైన బ్రాండ్ సృష్టించుకున్న విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ?24? సినిమా మరో ఐదురోజుల్లో థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా హీరో సూర్యతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..
ప్రశ్న) మీ ?24? కోసం తమిళ ప్రేక్షకులతో పాటు, తెలుగు ప్రేక్షకులు కూడా అంతే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతకీ ఈ ?24? కథేంటీ?
స) 75 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తీసిన సినిమా అండీ. కథ చెప్పేయమంటే ఎలా? మే 6న సినిమా విడుదలయ్యాకే ఈ టైటిల్ ఏంటీ? దాని వెనుకున్న కథేంటీ అన్నది మీకే తెలుస్తుంది. అప్పటివరకూ ఎదురుచూడాల్సిందే!
ప్రశ్న) ట్రైలర్ చూస్తే సినిమా టైమ్ ట్రావెల్ అంశంపైన నడిచే కథగా కనిపిస్తోంది. దానిగురించి ఏమైనా చెప్పండి?
స) టైమ్ ట్రావెల్ అంశం చుట్టూ అని కాదు కానీ, సినిమా టైమ్ చుట్టూ తిరుగుతూంటుంది. ప్రేక్షకుడికి చాలా కొత్తగా, ఓ ప్రయోగాత్మక సినిమానే ఎంటర్‌టైనింగ్‌గా నడిపిస్తే ఎలా ఉంటుందో చూసిన అనుభూతి కలుగుతుంది.
ప్రశ్న) ప్రయోగాత్మక కథంటే రిస్క్ అనిపించదా?
స) రిస్క్ అని ఏం లేదు. కమల్ హాసన్ గారు ఎప్పట్నుంచో ప్రయోగాలు చేస్తూన్నారు. సింగీతం శ్రీనివాస రావు గారు అప్పట్లోనే ?ఆదిత్య 369? అనే పెద్ద సాహసం చేశారు. చెప్పే అంశంలో నిజాయితీ ఉండి, అందరికీ అర్థం అయ్యేలా చెప్పగలిగితే చాలు. ఈ సినిమా విషయంలో కథ ఎంత ప్రయోగాత్మకం అయినా అన్ని వర్గాల ప్రేక్షకులూ అర్థం చేసుకునేలా ఉంటుంది. అందుకే ఈ సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నా.
ప్రశ్న) దర్శకుడు విక్రమ్ కుమార్ మీకు ఈ కథ వినిపించినప్పుడు ఎలా అనిపించింది?
స) నిజానికి ?మనం? సినిమాను రీమేక్ చేయొచ్చా? అన్న ఆలోచనతో విక్రమ్ కుమార్‌ను సంప్రదించా. అయితే ఆయనకు రీమేక్‌పై ఆసక్తి లేదు. అప్పుడే ఈ ?24? కథ వినిపిస్తే, నేను ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఓకే చెప్పేశా. ఇలాంటి సినిమాను నేనే నిర్మించాలని నా సొంత బ్యానర్‌పై నిర్మించా.
ప్రశ్న) మీకు చెప్పిన కథను విక్రమ్ అలాగే తీశారనుకుంటున్నారా?
స) అలాగే తీశారు. నాకు కథ చెప్పినప్పుడే ఆయన సినిమాను ఎలా ఊహిస్తున్నారో అర్థమైపోయింది. ?మనం? లాంటి కాంప్లికేటెడ్ కథను కూడా సింపుల్‌గా చెప్పగలిగిన సమర్థుడు విక్రమ్. అందుకే మొదట్నుంచీ ఆయనను, ఆయన కథను బలంగా నమ్మా.
ప్రశ్న) తెలుగులో డబ్బింగ్ ఎందుకు చెప్పడం లేదు?
స) చెప్పాలనే ఉంటుంది. అయితే ఎప్పుడూ ఈ సినిమా రిలీజ్, వేరొక సినిమా ప్రీ ప్రొడక్షన్, ఇలా చాలా అంశాలు ఒకదానికి ఒకటి ముడిపడి సమయం దొరకట్లేదు. కచ్చితంగా ?సింగం 3? తర్వాత మాత్రం డబ్బింగ్ స్వయంగా చెప్పే ప్రయత్నం చేస్తా.
ప్రశ్న) తెలుగులో స్ట్రైట్ సినిమా ఎప్పుడు?
స) దానికి కూడా సరైన సమయం దొరకాలి. త్రివిక్రమ్ గారితో ఓ సినిమా త్వరలోనే ఉంటుంది. ఆ సినిమా కోసం ఆయన రెండు మూడు కథలు సిద్ధం చేశారు. ఏది పర్ఫెక్ట్ అనుకుంటామో, ఆ కథతో ముందుకెళతాం. తెలుగులో స్ట్రైట్ సినిమా అంటే తమ్ముడు (కార్తీ) చేసిన ఊపిరి కంటే బాగుండాలి మరి.. (నవ్వుతూ)!
ప్రశ్న) గత సినిమాల ప్రభావం వల్ల ?24? సినిమా విషయంలో ఏమైనా ఒత్తిడి ఉందా?
స) అలాంటిదేమీ లేదు. కథను నమ్మే ఏ సినిమా అయినా మొదలుపెడతాం. మధ్యలో చాలా పరిస్థితులు ఆ కథలోని ఎమోషన్ పోవడానికి కారణం కావొచ్చు. ఎప్పుడైతే మనం మొదట్లో కథ విన్నప్పటి ఫీలింగ్ చివరిరోజు వరకూ కొనసాగుతుందో అప్పుడే ఆ సినిమా ప్రేక్షకుడికీ నచ్చుతుందన్నది నా అభిప్రాయం. నా గత రెండు చిత్రాల్లో ఎక్కడో ఈ ఎమోషన్ పోయిందని అనుకుంటున్నా. ?24? విషయంలో మాత్రం ఇప్పటికీ నేను ఒకే ఫీలింగ్‍తో ఉన్నా. తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రయోగాల్లో ఒకటిగా ?24? నిలుస్తుందన్న నమ్మకం ఉంది.

,  ,  ,  ,  ,  ,  ,