Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-May-2017 14:26:23
facebook Twitter Googleplus
Photo

ఈ ఏడాది సంక్రాంతికి సినిమాల సందడి మామూలుగా లేదు. ఓవైపు ఖైదీ నెంబర్ 150.. మరోవైపు గౌతమీపుత్ర శాతకర్ణి.. మోత మోగించేశాయి. మధ్యలో శతమానం భవతి కూడా అదరగొట్టేసింది. కానీ వేసవిలో మాత్రం అనుకున్న స్థాయిలో సందడి కనిపించలేదు. బాహుబలి: ది కంక్లూజన మినహాయిస్తే భారీ సినిమాల సందడి లేకపోయింది. దువ్వాడ జగన్నాథం తో పాటు స్పైడర్ రేసు నుంచి తప్పుకోవడం.. కాటమరాయుడు నిరాశ పరచడంతో వేసవి కళ తప్పింది. ఐతే సమ్మర్ డిజప్పాయింట్ చేసినప్పటికీ.. తర్వాతి పెద్ద సీజన్ అయిన దసరాకు మాత్రం భారీ సినిమాలతో థియేటర్లు కళకళలాడిపోనున్నాయి.

ఈ దసరాకు ఎన్నడూ లేనంత పోటీ కనిపిస్తోంది. ముందుగా దసరాకు బెర్తు కన్ఫమ్ చేసుకున్న సినిమా నందమూరి బాలకృష్ణ-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమానే. ప్రారంభోత్సవం రోజే ఆ సినిమా రిలీజ్ డేట్ ఇచ్చారు. సెప్టెంబరు 30న విడుదల అని ప్రకటించేశారు. ఈ సర్ప్రైజింగ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఇక మూడు వరుస హిట్లతో జోరుమీదున్న ఎన్టీఆర్.. బాబీ దర్శకత్వంలో చేస్తున్న జై లవకుశ కూడా సెప్టెంబర్లోనే రాబోతోంది. ఆ సినిమాపై అంచనాలు తక్కువగా ఏమీ లేవు. ఇక రామ్ చరణ్-సుకుమార్ కాంబినేషన్లో రానున్న కొత్త సినిమా కూడా ఆసక్తి రేకెత్తించేదే. దసరాను టార్గెట్ చేసుకుని చకచకా షూటింగ్ కానిస్తున్నారు. ఇక ఆలస్యంగా దసరా రేసులోకి వచ్చిన సినిమా స్పైడర్. వేసవికే రావాల్సిన ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ చివరికి దసరాకు ఫిక్సయింది. సెప్టెంబర్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు తాజాగా ప్రకటించారు.

,  ,  ,  ,  ,