Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Jul-2017 10:51:20
facebook Twitter Googleplus
Photo

పిల్లలంటే టీనేజ్ లోకి రాగానే పార్టీలు పబ్బులకు వెళ్లాల్సిందే. లేకుంటే వాళ్లకు కల్చర్ తెలియదన్నట్లుగా మాట్లాడుకుంటారు జనాలు. అందులోనూ బాలీవుడ్లో ఈ కల్చర్ బాగా ఎక్కువ. అక్కడ సెలబ్రెటీల పిల్లలందరూ ఓ వయసు రాగానే పార్టీల బాట పడుతుంటారు. లేట్ లైట్ పబ్బుల్లో గడిపి ఏ తెల్లవారుజామునో ఇంటికి వస్తుంటారు. శ్రీదేవి కూతుళ్లు కూడా చిన్న వయసులోనే పార్టీ ఫ్రీక్స్ గా గుర్తింపు సంపాదించారు. ఐతే జాన్వి.. ఖుషి పెరిగి కల్చర్లో వాళ్లకు లేట్ నైట్ పార్టీలు మామూలు విషయం లాగే అనిపించొచ్చేమో కానీ.. దక్షిణాదిన సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన శ్రీదేవికి ఇలాంటివి అంతగా రుచించేట్లు లేవు.

ఈ పార్టీల విషయంలో తన అభ్యంతరాల్ని ఓ ఇంటర్వ్యూలో మొహమాటం లేకుండా చెప్పేసింది శ్రీదేవి. కూతుళ్ల విషయంలో తాను చాలా టెన్షన్ పడతానని అంటోంది శ్రీదేవి. తన పిల్లలు పార్టీలకు వెళ్తే తాను ప్రశాంతంగా పడుకోలేనని.. వాళ్లొచ్చే వరకు కళ్లల్లో వత్తులేసుకుని ఎదురు చూస్తుంటానని శ్రీదేవి తెలిపింది. సగటు తల్లి లాగే తాను కూడా తన పిల్లల విషయంలో భయపడుతుంటానని.. వాళ్లు క్షేమంగా ఇంటికి చేరతారా లేదా అన్న టెన్షన్ తో ఎదురు చూస్తుంటానని ఆమె తెలిపింది. లేట్ నైట్ పార్టీలకు తరచుగా వెళ్లడం వల్ల ఆరోగ్యం దెబ్బ తింటుందని.. నెర్వ్ సిస్టమ్ పాడవుతుందని.. అయినా ఈ విషయం తెలుసుకోకపోవడం బాధాకరమని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించింది శ్రీదేవి.

,  ,  ,  ,