Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Jun-2017 11:14:19
facebook Twitter Googleplus
Photo

డీజే-దువ్వాడ జగన్నాధం మూవీ చిత్రాన్ని ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేయడం సెన్సేషన్ అయిపోయింది. దీనిపై నిర్మాత దిల్ రాజు.. దర్శకుడు హరీష్ శంకర్ కలిసి.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దయచేసి బెస్ట్ క్వాలిటీ సౌండ్.. బెస్ట్ క్వాలిటీ పిక్చర్ మీకు అందించాలనే ఉద్దేశ్యంతో ఇండియాలో నెంబర్ వన్ కెమేరామ్యాన్ ను.. నెంబర్ వన్ సౌండ్ ఇంజినీర్ ను తీసుకొచ్చి.. మంచి చిత్రాన్ని మీకు అందిస్తున్నాం. ఫ్యాన్స్ కు నేను చెప్పేది ఏంటంటే.. ఎవరి ఫ్యాన్స్ అయినా కావచ్చు. ఎవరి సినిమాకు ఇలాంటి పరిస్థితి రాకూడదు. ఎవరి సినిమా ఆన్ లైన్ లో రాకూడదు. మీకు వ్యక్తిగతంగా ఒక డైరెక్టర్ కో.. ఒక హీరోకో నష్టం చేకూర్చాలనో.. వారి మీద కోపంతోనో మీరు ఇలా చేస్తే.. ఆ వ్యక్తులకు నష్టం ఉండదు. దిల్ రాజు గారు నాకు ఈ సినిమా కోసం నాకివ్వాల్సిన డబ్బులు ఇచ్చేశారు. హీరోకు కూడా ఇచ్చేసే ఉంటారు. ఫైనల్ గా నష్టపోయేది దిల్ రాజు గారే. నాకు తెలిసి మీ కోపం దిల్ రాజు మీద ఉండదు. చివరకు ఆ సినిమాను కొన్ని డిస్ట్రిబ్యూటర్స్.. బయ్యర్స్ నష్టపోతారు. మీరు చేసే పనుల వల్ల.. డైరెక్టర్ కు కానీ.. హీరోకు కానీ లాస్ ఉండదు. మీరు ఎవరిని టార్గెట్ చేసి చేద్దామని అనుకుంటున్నారో మీరు ఆ లక్ష్యాన్ని చేరుకోలేరు అన్నాడు హరీష్ శంకర్.

ఇది కాకుండా సినిమానే నమ్ముకుని బతుకుతున్న కొన్ని వేల కుటుంబాలు రోడ్డు మీద పడే అవకాశం ఉంటుంది. దయచేసి బెస్ట్ సినిమా ఎక్స్ పీరియన్స్ ను థియేటర్లలో చూడండి. ఇదేదో క్రేజ్ తో.. మన చేతుల్లో టెక్నాలజీ అందుబాటులో ఉండడంతో ఓ ఫ్యాంటసీతో చేస్తున్నారేమో.. నాకు తెలిసి మీరు కూడా ఒక మనిషి రోడ్డు మీదకు వచ్చేయాలనే ఉద్దేశ్యంతో ఇలాంటివి చేయరు. ఒక క్రేజ్ లో మత్తులో ఇలా చేస్తున్నారు. దీని వల్ల కలిగే డ్యామేజ్ మీకు తెలియదని అనుకుంటున్నాను. దయ చేసి దీనివల్ల ఎవ్వరికీ ఉపయోగం ఉండదు.

,  ,  ,  ,  ,