Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Jan-2016 17:07:04
facebook Twitter Googleplus
Photo

రీసెంట్ గా తన బావ సుధీర్ బాబు గురించి చెప్పేందుకు.. సూపర్ స్టార్ మహేష్ ఒక మాట వాడాడు. ఒక కరెక్ట్ సినిమా పడితే స్టార్ అయిపోతాడని మహేష్ బాబు అన్న మాటలో చాలా వాస్తవం ఉంది. ఆ విషయం తాప్సీని చూస్తే అర్ధమవుతుంది.

సినిమా ఇండస్ట్రీలో ఒక కరెక్ట్ హిట్ పడితే వచ్చే క్రేజ్ వేరుగా ఉంటుంది. ఏళ్ల తరబడి టాలీవుడ్ తో పాటు పలు ఇండస్ట్రీలలో చాలానే ప్రయత్నాలు చేసినా తాప్సీ పన్నూకి పెద్దగా కలిసి రాలేదు. కానీ 2015 మాత్రం ఈమె స్థాయి మార్చేసింది. ఒకే ఒక్క సినిమా తాప్సీ కెరీర్ ని టాప్ గేర్ లోకి తీసుకెళ్లిపోయింది. రాఘవ లారెన్స్ ఇచ్చిన గంగ మూవీతో.. క్రేజీ హీరోయిన్ అయిపోయింది. నిజానికి ఇది తమిళం సినిమానే అయినా.. కోలీవుడ్ తోపాటు టాలీవుడ్ ను దడదడలాడించింది తాప్సీ. ఈ దెబ్బకి బాలీవుడ్ నుంచి తాప్సీకి ఆఫర్ల వరద ముంచెత్తుతోంది.

రీసెంట్ గా అన్ని సినిమా ఇండస్ట్రీల వాళ్లు కలిసి ఆడే క్రికెట్ మ్యాచ్ సంరంభం అయిన లీగ్ కు ఈమెను బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకున్నారు. సీసీఎల్ గా పిలిచే సెలబ్రిటీ క్రికెట్ లీగ్ కు ప్రధాన ప్రచారకర్త బాధ్యతలు తాప్సీ చేతికి దక్కాయి. అన్ని ఇండస్ట్రీలలోనూ క్రేజ్ ఉన్న భామగా గుర్తింపు పొందడంతోనే.. ఈ అవకాశం దక్కిందని చెప్పాలి. ఏమైనా.. ఒకే ఒక్క సినిమాతో ఇలా తాప్సీ లైఫ్ టాప్ గేర్ కి చేరిపోయింది. ఇక సినిమా ఆట అయిపోయి.. ఇక ప్లేయర్లతో కూడా ఆటలు మొదలెట్టేయనుంది ఢిల్లీ సుందరి తాప్సీ పన్ను.

,  ,  ,