Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Aug-2016 10:44:59
facebook Twitter Googleplus
Photo

అక్కినేని నాగార్జున, కె. రాఘవేంద్రరావు కాంబినేషన్ లో తెరకెక్కతున్న భక్తిరస ప్రధాన చిత్రం 'ఓం నమో వెంకటేశాయ'. ఈ సినిమాలో నాగార్జున.. వేంకటేశ్వరస్వామి భక్తుడు హథీమ్ రామ్ బాబాగా కనిపించనున్న విషయం తెలిసిందే. ఆ పాత్రకు సంబంధించిన ప్రీ లుక్ను ఆదివారం ఉదయం విడుదల చేశారు. నాగార్జున ట్విట్టర్ అకౌంట్ ద్వారా తన పాత్ర ప్రీ-లుక్ ను అభిమానులతో పంచుకున్నారు.

ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'ఓం నమో వెంకటేశాయ' శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోంది. ఈ సినిమాకు జె.కె. భారవి కథ అందించారు. ఉత్తర భారతదేశానికి చెందిన హథీమ్ రామ్ బాబా తిరుమల శ్రీవారికి వీర భక్తుడు. శ్రీనివాసుడిని నిత్యం భక్తిశ్రద్ధలతో కొలిచేందుకు తిరుపతిలో స్థిరపడిపోయాడు. ఇప్పటికి ఆయన సమాధి తిరుపతిలో ఉంది.

,  ,  ,  ,