Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Jun-2016 15:18:36
facebook Twitter Googleplus
Photo

మాటల మాంత్రికుడు,దర్శకుడు 'త్రివిక్రమ్' దర్శకత్వంలో నితిన్,సమంత,అనుపమ పరమేశ్వరన్ లతో 'హారిక అండ్ హాసిని క్రియేషన్స్' పతాకంపై నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన 'అఆ' చిత్రం ఘన విజయం సాధించిన విషయం విదితమే.
ఈ చిత్రం సాధించిన ఘన విజయం సందర్భాన్ని పురస్కరించుకొని ఈ నెల 12 న గుంటూరు లో 'అఆ' విజయోత్సవ వేడుకను జరుపనున్నట్లు నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల శాఖా మంత్రి శ్రీ గంటా శ్రీనివాసరావు అధ్యక్షతన గుంటూరు లోని 'సిద్ధార్ధ గార్డెన్స్' లో ఆదివారం (జూన్ 12) సాయంత్రం 7 గంటలకు జరిగే ఈ విజయోత్సవ వేడుకలోమాటల మాంత్రికుడు,దర్శకుడు 'త్రివిక్రమ్' హీరో నితిన్,సమంత,అనుపమ.నదియ,నరేష్,రావు రమేష్ ,అజయ్,హరితేజ, శ్రీనివాస రెడ్డి,ప్రవీణ్,మధునందన్, పాటల రచయితలు రామజోగయ్య శాస్త్రి, కృష్ణ చైతన్య, ల తో పాటు పలువురు నటీ నటులు, సాంకేతిక నిపుణులు, పలువురు రాజకీయనాయకులు పాల్గొంటున్నట్లు నిర్మాత తెలిపారు

,  ,  ,  ,  ,  ,  ,