Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Sep-2017 10:47:16
facebook Twitter Googleplus
Photo

పి.ఎస్.వి. గరుడ వేగ 126.18ఎం. ఈ సినిమా కోసం రూ. 25 కోట్ల వరకు ఖర్చు పెట్టారనే విషయం టాలీవుడ్ లో చాలామందిని ఆశ్చర్య పరిచింది. ఎందుకుంటే ఈ మధ్య రాజశేఖర్ లైమ్ లైట్ లో లేడు. గత కొన్నేళ్ల కాలంలో ఎవడైతే నాకేంటి మినహా అతడి ఖాతాలో హిట్లంటూ ఏమీ లేవు. ఇలాంటి టైంలో భారీ బడ్జెట్ తో సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. గుంటూరు టాకీస్ ఫేం ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకు డైరెక్టర్.

ఈ సినిమా చేయడం వెనుక కారణాలను ఇటీవల రాజశేఖర్ స్వయంగా చెప్పుకొచ్చాడు. ‘‘హీరోగా వరస ఫ్లాపులు ఎదురవుతుండటంతో నెగిటివ్ రోల్స్ లేదా క్యారెక్టర్ రోల్స్ లో నటించమంటూ చాలామంది సలహా ఇచ్చారు. వాటి గురించి నేనూ సీరియస్ గానే ఆలోచించా. ఆ తర్వాత చాలామంది కలిసి స్టోరీలు వినిపించారు. అవేవీ ఎక్సైటింగ్ గా అనిపించలేదు. అలాంటి టైంలో ప్రవీణ్ సత్తారు ఈ స్టోరీ వినిపించాడు. నా సినిమా ‘మగాడు’ అంతే తనకు ఇష్టమని.. ఆ జోనర్ లో సినిమా చేద్దామని చెప్పుకొచ్చాడు. అసలు ఈ సబ్జెక్టు తను హ్యాండిల్ చేయగలడా అని ముందు నేనూ డౌట్ పడ్డా.. కానీ తన పని అద్భుతంగా పూర్తి చేశాడు’’ అంటూ ఈ చిత్రం నేపథ్యాన్ని వివరించాడు రాజశేఖర్.

‘‘ఈ సినిమాకు ముందు అనుకున్న బడ్జెట్ రూ. 5 కోట్లు మాత్రమే. తర్వాత ఈ స్టోరీకి మరింత బడ్జెట్ అవసరమన్న విషయం మాకు అర్ధమైంది. మంచి ప్రొడ్యూసర్ కోసం వెతుకుతున్న టైంలో మా నాన్న స్నేహితుడు కోటేశ్వరరాజు ఈ సినిమా నిర్మించడానికి ముందుకొచ్చారు. ఈ సినిమాను హాలీవుడ్ స్టాండర్డ్ లో నిర్మించాం. అందుకే అంత ఖర్చయింది’’ అని బడ్జెట్ ఎందుకు పెంచాల్సి వచ్చిందో చెప్పుకొచ్చాడు రాజశేఖర్.

,  ,  ,  ,  ,