Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Apr-2016 13:18:02
facebook Twitter Googleplus
Photo

తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా త్రివిక్రమ్ స్థానమేంటో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. మాటల మ్యాజిక్‌తో కట్టిపడేసే ఈ దర్శకుడు, తాజాగా ?అ..ఆ..? అన్న ఆసక్తికర టైటిల్‌తో ఓ రొమాంటిక్ కామెడీని మనముందుకు తెస్తున్నారు. నితిన్, సమంతలు హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాపై ఫస్ట్‌లుక్ రిలీజ్ అయినప్పట్నుంచే మంచి అంచనాలుండగా, తాజాగా ఆ అంచనాలను రెట్టింపు చేస్తూ టీమ్ విడుదల చేసిన ఫస్ట్ టీజర్ అభిమానులను బాగా ఆకర్షిస్తోంది.
?అ..ఆ..? అంటే అనసూయ రామలింగం, ఆనంద్ విహారి అన్న ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ వచ్చిన ఈ టీజర్ త్రివిక్రమ్ మార్క్ క్లాస్ సినిమాను తలపించేలా ఉంది. విజువల్స్, నటీనటుల స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ త్రివిక్రమ్ సినిమా అన్న ఫీల్‌ను రెట్టింపు చేసేలా ఉన్నాయి. ముఖ్యంగా ?పక్క పక్కనే ఉండే అక్షరాలు.. పరిచయం కావడానికి, పాతికేళ్ళు పట్టింది!? అన్న డైలాగ్ రచయితగా త్రివిక్రమ్ స్టైల్‌ను మరోసారి బలంగా పరిచయం చేసిందనే చెప్పాలి. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమా మే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

,  ,  ,  ,  ,