Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Jul-2016 15:25:17
facebook Twitter Googleplus
Photo

హైదరాబాద్: నితిన్, సమంత జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అ ఆ. పెద్దగా అంచనాలు లేకుండా రిలీజైన ఈ చిత్రం మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తో పాటు మంచి రివ్యూలు సాధించడంతో ఇప్పుడు కలెక్షన్లలో ముందుకు దూసుకుపోయింది. అయితే ఫుల్ రన్ కి వచ్చేసరికి మ్యాజిక్ మార్క్ దగ్గరకు వచ్చి రీచ్ కాకుండానే ఆగిపోయింది. అ ఆ. ఓపెనింగ్స్ లో వచ్చిన ఈ జోరే చివరి రోజు వరకూ కొనసాగితే, ఈ సమ్మర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచే అవకాశం ఉందని అంచనాలు వేసారు.కానీ కొత్త సినిమాల రాకతో స్లో అయిపోయిన అ..ఆ ఆ సినిమాల్లో జెంటిల్ మాన్ ఒక్కటే పోటిలో ఉన్నా కూడా స్టడీగా ఉండలేకపోయింది. దాంతో కలెక్షన్స్ చాలా చోట్ల స్లో అవ్వగా టోటల్ రన్ లో 47.48 కోట్ల షేర్ (75.4 కోట్ల గ్రాస్) వరకు మాత్రమే కలెక్ట్ చేయగలిగింది ఈ సినిమా. నితిన్ కెరంరీ లో ఇంతలా భారీ కలెక్షన్ సునామీ సృష్టించిన సంచలన సినిమా కూడా ఏమీ లేదు. ఆ లోటును అ ఆ పూర్తిగా తీర్చేసినట్లే. త్రివిక్రమ్ సినిమా అనగానే ఉండే అంచనాలకు, పాజిటివ్ టాక్ యాడ్ అవడంతో మూవీ భారీ కలెక్షన్ల దిశగా పరుగులు పెట్టింది. అసలు మొదట్లో సినిమా ఒక 35 కోట్ల వరకూ వసూలు చేస్తుందని భావించిన ట్రేడ్ వర్గాలను కూడా ఆశ్చర్యపరుస్తూ అతి తొందరలోనే ఈ మార్క్ రీచ్ అయిపోయింది. రోజు రోజుకూ కలెక్షన్స్ పెంచుకుంటూ పోయి రికార్డ్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈ సినిమాకు అద్భుతమైన ఆదరణ లభించటం కలిసి వచ్చింది. అలాగే ఈ చిత్రం నైజాం, ఓవర్ సీస్ లే ఎక్కువ కలెక్ట్ చేసాయి. రెండు చోట్లా కలిసి 25 కోట్లు వరకూ వసూలు చేసి ఈ సినిమా కలెక్షన్స్ రికార్డ్ క్రియేట్ చేసాయి.

,  ,  ,  ,  ,  ,