Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Nov-2016 10:36:12
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జునకు వయసు మీదపడుతుండడమా! ఇంకెవరైనా ఈ మాట అంటే ఒప్పుకోవడం కుదరదు కానీ.. ఈ మాట నాగ్ స్వయంగా అనడంతో వినడం తప్ప ఏం చేయలేం. ఇక ఇలా తన ఏజ్ గురించి నాగ్ ఎందుకు కామెంట్ చేయాల్సి వచ్చిందో తెలుసుకుందాం. నాగార్జున నటించబోతున్నా హారర్ థ్రిల్లర్ మూవీ అధికారికంగా ప్రారంభమైంది.

యాంకర్ నుంచి డైరెక్టర్ గా మారిన ఓంకార్ దర్శకత్వంలో రాజుగారి గది2 ప్రారంభించి పూజా కార్యక్రమాలు ముహూర్తం షాట్ తీసిన సందర్భంగా.. ఈ మూవీని యాక్సెప్ట్ చేయడానికి కారణాలు వివరించారు నాగ్. 'మనం దగ్గర నుంచి అన్నీ వరుసగా మంచి పాత్రలు చేస్తున్నా. ఓం నమో వెంకటేశాయ తర్వాత ఏ కేరక్టర్ చేయాలనే అంశంపై క్లారిటీ రాలేదు. ఆ సమయంలో ఓంకార్ దగ్గర రాజుగారి గది2 స్క్రిప్ట్ ఉందని తెలిసింది. ఇది హారర్ థ్రిల్లర్ ల మధ్య నడిచే మూవీ. చాలా మంచి కేరక్టర్. చిన్నప్పటి నుంచి ఇలాంటి సినిమాలు చూశాను. ఇలాంటి డిఫరెంట్ మూవీ చేయాలనే ఆలోచన ఉన్నపుడు.. రాజుగారి గది2 అవకాశం వచ్చింది' అని చెప్పారు నాగ్.

నాకు వయసు మీద పడుతోందని తెలుసు. లీడ్ రోల్ లో ఇంకెన్ని సినిమాలు చేస్తానో చెప్పలేదు. అందుకే ఇలాంటి విభిన్నమైన సినిమాను చేశాననే సంతృప్తిని వదులుకోకూడదని అనుకున్నాను అంటూ సంచలన కామెంట్స్ చేసిన నాగార్జున.. టాలీవుడ్ సినిమాల్లో ఇదో ట్రెండ్ సెట్టర్ కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

,  ,  ,  ,  ,