Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Jul-2017 12:31:56
facebook Twitter Googleplus
Photo

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా నటిస్తూ కెరీర్ ని కొనసాగిస్తున్నాడు ఆది పినిశెట్టి. తెలుగులో హీరోగా ఒకే ఒక సినిమా చేసిన ఆదికి తమిళంలో కాస్త క్రేజ్ ఉందన్న సంగతి వాస్తవం. అయితే తెలుగులో కూడా గుర్తింపు తెచ్చుకోవడానికి అల్లు అర్జున్ సరైనోడులో విలన్ గా నటించాడు ఆది. ఈ ప్లాన్ కాస్త వర్క్ అవుట్ అవ్వడంతో ఇప్పుడు అదే పనిలో బిజీ అయిపోయాడు.

అయితే పెరుగుట విరుగట కొరకే అన్నట్లు తాజాగా వచ్చిన నిన్ను కోరీలో ఆది పోషించిన పాత్రకి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఈ సినిమా పోస్టర్స్ - ట్రైలర్స్ లో ఆదిని పదే పదే చూపించినప్పటికి జనాలు కాన్సన్ ట్రేషన్ మాత్రం నాని - నివేధథామస్ ల పైనే పడింది. దీంతో చేసేదేమి లేక ఆది సైలెంట్ అయిపోయాడని సమాచారం.

ఇక ఆది తాజాగా నటించిన మరకతమణి బాగున్నప్పటికి డబ్బింగ్ సినిమా బ్యాచ్ లోకి వెళ్లిపోయింది. ఇది ఇలా ఉంటే ఆది పినిశెట్టి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో అలానే రామ్ చరణ్ - సుకుమార్ రంగస్థలంలో నటిస్తున్నాడు.

,  ,  ,  ,  ,