Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Nov-2016 14:47:42
facebook Twitter Googleplus
Photo

మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ గా బాలీవుడ్ తో పాటు అభిమానులు ముద్దుగా పిలుచుకునే అమీర్ ఖాన్ కొత్త సినిమా వచ్చేస్తోంది. క్రిస్మస్ కానుకగా రిలీజ్ కానున్న దంగల్ మూవీ కోసం.. అమీర్ చాలానే కష్టపడ్డాడనే విషయం తెలుస్తూనే ఉంది. కేరక్టర్ కోసం మేకోవర్ చేయడంలో.. అమీర్ ని మించిన బాలీవుడ్ హీరో లేడనే సంగతి మరోసారి తేలిపోగా.. దంగల్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

అటు బాలీవుడ్ లో మాత్రమే కాకుండా.. దేశవ్యాప్తంగా అమీర్ ఖాన్ మూవీకి క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా టాలీవుడ్ లో అయితే.. ఈ స్టార్ సినిమాలకు ఫుల్ క్రేజ్ ఉంటుంది. ఇప్పటివరకూ డైరెక్ట్ హిందీ సినిమాలే ఇచ్చారు కానీ.. ఇప్పుడు మాత్రం తెలుగు డబ్బింగ్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. దంగల్ (యుద్ధం) పేరుతో తెలుగు వెర్షన్ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే తెలుగు పోస్టర్ ను విడుదల చేయగా.. ఇప్పుడు తెలుగు ట్రైలర్ ను కూడా విడుదల చేయడం విశేషం. దంగల్ ను తెలుగులోకి డబ్బింగ్ చేయడం అంటే.. ఏదో నామ్ కే వాస్తే చేసినట్లుగా కాకుండా.. దాదాపు డైరెక్ట్ తెలుగు మూవీ రేంజ్ లో మంచి క్వాలిటీతో చేయడం చెప్పుకోవాల్సిన విషయం.

హిందీ నుంచి తెలుగులోకి వచ్చే డబ్బింగ్ మూవీస్ లో ఈ రేంజ్ క్వాలిటీ చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇక స్టోరీ విషయానికి వస్తే.. తనకు నలుగురూ కూతుళ్లే పుట్టడంతో.. నిరుత్సాహపడ్డ మహావీర్ ఫొగట్ అనే మల్ల యుద్ధవీరుడు.. ఆ తర్వాత తన ఇద్దరు కూతుళ్లలో ఇద్దరిని ఎలా రెజ్లింగ్ ఛాంపియన్లుగా మార్చాడన్నదే దంగల్ మూవీ. డిసెంబర్ 23న దంగల్ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.

,  ,  ,  ,