Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Apr-2017 10:29:01
facebook Twitter Googleplus
Photo

ఇండియన్ సినిమా చరిత్రలోనే ఏ చిత్రానికీ లేని స్థాయిలో అంచనాలున్నాయి బాహుబలి: ది కంక్లూజన్ మీద. ఈ సినిమా టికెట్ సాధిస్తే.. అదో పెద్ద ఘనతగా భావించే పరిస్థితి. ఇప్పటికే ఆన్ లైన్ బుకింగ్స్ ఓపెనవగా.. టికెట్లు హాట్ కేకుల్లా అయిపోతున్నాయి. అసలు ఎవరు కొంటున్నారో తెలియదు. వెబ్ సైట్ ఓపెన్ చేయగానే టికెట్లు అయిపోయినట్లే కనిపిస్తోంది. ఇక థియేటర్ల దగ్గరికెళ్లినా ఫలితం ఉండట్లేదు. దీంతో టికెట్ ఎలా దక్కించుకోవాలో తెలియక అయోమయంలో పడిపోతున్నారు జనాలు. సామాన్యుల దగ్గర్నుంచి సొసైటీలో ఒక స్థాయి ఉన్నవాళ్లకు కూడా బాహుబలి-2 టికెట్ సాధించడం పెద్ద సవాలుగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఇప్పుడు థియేటర్ల మేనేజర్లే కింగ్ మేకర్లు కాబోతున్నారు.మరో పది రోజుల పాటు వాళ్ల మొబైల్స్ అదే పనిగా మోగబోతున్నాయి. రాజకీయ నేతలు.. సినిమా వాళ్లు.. సొసైటీలో ప్రముఖులందరూ ఇప్పుడు థియేటర్ల మేనేజర్ల మీదే పడబోతున్నారు. ఇప్పటికే మేనేజర్లపై టికెట్ల కోసం విపరీతమైన ఒత్తిడి వస్తోందట. వాళ్లను ప్రసన్నం చేసుకోవడానికి.. టికెట్లు సంపాదించడానికి గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయి. ఐతే డిమాండుకు తగ్గట్లు టికెట్లు ఇవ్వడం థియేటర్ల మేనేజర్లకు కూడా సాధ్యమయ్యే పని కాదు. ఈ డిమాండును దృష్టిలో ఉంచుకుని బోలెడంత సంపాదించుకోవడానికి ఇది మంచి అవకాశంగా కూడా మేనేజర్లు భావిస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,