Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Jun-2017 14:04:32
facebook Twitter Googleplus
Photo

దువ్వాడ జగన్నాథం దర్శకుడు హరీష్ శంకర్ ట్విట్టర్లో పెద్ద షాకిచ్చాడు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ఈ రోజే విడుదల కాబోతున్నట్లు ప్రకటించాడు. రాత్రి 7.30కు డీజే ట్రైలర్ ను ట్విట్టర్లో లాంచ్ చేయబోతున్నారు. ఆడియో వేడుకో.. ప్రి రిలీజ్ ఈవెంటో పెట్టి.. భారీ హంగామా మధ్య థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేస్తారేమో అనుకుంటే.. టీజర్ మాదిరే ట్రైలర్ లాంచ్ కూడా సోషల్ మీడియాలోనే చేయబోతుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. అది కూడా కౌంట్ డౌన్ ఏమీ లేకుండా ఉదయం ప్రకటించి.. సాయంత్రానికి ట్రైలర్ లాంచ్ చేసేస్తుండటం విడ్డూరమే. డీజే టీజర్ తో యూట్యూబ్ లో ఎంతటి సంచలనానికి తెరతీసిందో తెలిసిందే.

ఈ మధ్యే వచ్చిన గుడిలో బడిలో మడిలో.. పాట కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. డీజే ట్రైలర్ కూడా అలాగే ప్రకంపనలు రేపుతుందని.. నాన్-బాహుబలి ట్రైలర్ రికార్డుల్ని బద్దలు కొట్టేస్తుందని భావిస్తున్నారు. దాదాపు రెండు నిమిషాల నిడివి ఉండే డీజే ట్రైలర్లో స్టోరీ ఏంటో చెప్పేయబోతున్నాడట హరీష్ శంకర్. ఇందులో బ్రాహ్మణ బన్నీలోని రెండో యాంగిల్ కూడా చూపిస్తారట. ఇప్పటికే ఈ సినిమా కథ అంటూ మీడియాలో చాలా ప్రచారాలు నడిచాయి. జనాలు ఆల్రెడీ ఒక ఐడియాతో ఉన్నారు. మరి ట్రైలర్ ద్వారా ఎలాంటి ఐడియా వస్తుందో చూడాలి. ట్రైలర్ అంచనాలకు తగ్గట్లే ఎంటర్టైనింగ్ గా ఉంటుందని అంటున్నారు.

,  ,  ,  ,  ,  ,