Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Jun-2017 10:54:52
facebook Twitter Googleplus
Photo

ఒక పాత్రలో నటుడు ఇమిడిపోవాలి అంటే ఆ పాత్ర పూర్వాపరాలు బాగా తెలిసి ఉండాలి అప్పుడే ఆ నటుడు చేస్తున్న పాత్రలో అచ్చంగా పోత పోసినట్లు కనిపిస్తారు. అమీర్ ఖాన్ ఈ విషయంలో ఒక్క అడుగు కూడా వెనకకు వేయాడు. దంగల్ సినిమా కోసం తన శరీరం పై చాల ప్రయోగాలు చేసుకొన్నాడు. ముసలి పాత్ర కోసం లావు అయి మళ్ళీ యుక్త వయసు పాత్ర కోసం తగ్గి పోయాడు. అలానే ఇప్పుడు వస్తున్న థగ్స్ ఆఫ్ హిందోస్తాన్ సినిమా కోసం చెవులు ముక్కు కుట్టించుకున్నాడు.

థగ్స్ ఆఫ్ హిందోస్తాన్ సినిమాలో కొన్ని సన్నివేశాలు కోసం ఈ వయసులో తన ముక్కును కుట్టించుకొని ముక్కుపుడక పెట్టుకున్నాడు. అలానే తన చెవులలో కూడా కొన్ని చోట్ల కుట్టించుకొని పాతకాలపు గిరిజన తెగ అలంకరించునే విధంగా రింగులు తగిలించుకున్నాడు. బాగా పసి వయసులో కుట్టించుకుంటె ఒకలాంటి నొప్పి ఉంటుంది కానీ మనకు ఆ నొప్పి ఎంతో తెలిసి శరీరం కొంత గట్టిపడినాకా చేయించుకుంటే ఎక్కువ నొప్పి ఉంటుంది. పాత్రకు న్యాయం చేయడానికి అమీర్ మొత్తానికి ఇంతకు తెగించాడు అన్నమాట. కుట్టించుకొని నెల రోజులు అవుతుంది అంటా కానీ ఇప్పటికీ నొప్పి తగ్గటం లేదట. రాత్రి నిద్రకూడా సరిగా పట్టటంలేదు అని అంటున్నాడు. ఇప్పుడు ఎవరైనా నా చెవిని ముడితే ఇంటి పెంకులు ఎగిరే విదంగా అరుస్తున్నానని చెప్పాడు. ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టంగా ఉన్నా అతను చేసిన ఈ పనికి అతని కొత్త రూపానికి సినీ అభిమాన జనం జైహో లు కొడుతున్నారు.ఇదే అసలు రూపం కాదు అంటా ఇది కేవలం శాంపెల్ అని చెబుతున్నారు.

విజయ్ కృష్ణ ఆచార్య డైరక్షన్లో వస్తున్న థగ్స్ ఆఫ్ హిందోస్తాన్ సినిమాలో అమీర్ ఖాన్ అమితాబ్ బచ్చన్ దంగల్ ఫేమ్ ఫాతిమా సనా షేక్ బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ నటిస్తున్నారు.

,  ,  ,  ,  ,