బాహుబలి మూవీ కోసం 4ఏళ్లకు పైగా సమయం కేటాయించిన ప్రభాస్ ఎట్టకేలకు ఆ ప్రాజెక్టును సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశాడు. దేశవ్యాప్తంగా బోలెడంత గుర్తింపు సంపాదించుకున్నాడు. బాహుబలి విజయంతో జోష్ వచ్చినా.. ఆ సినిమాకు పడ్డ కష్టం నుంచి రిలీవ్ అయ్యేందుకు యూఎస్ వెకేషన్ వెళ్లాడు ప్రభాస్.
చాలాకాలం తర్వాత తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సుదీర్ఘకాలం గడిపిన ప్రభాస్.. ఇప్పుడు యూఎస్ టూర్ ఫినిష్ చేసుకుని ఇండియా తిరిగి వచ్చేశాడు. అంతే కాదు తన నెక్ట్స్ మూవీ సాహో కోసం ప్రిపేర్ అయిపోతున్నాడు కూడా. బాహుబలి కోసం భారీగా బాడీ పెంచేసిన ప్రభాస్.. ఇప్పుడు కొత్త లుక్ తో కనిపిస్తున్నాడు. రీసెంట్ గా హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ తో కలిసి ప్రభాస్ కనిపించగా.. యంగ్ రెబల్ స్టార్ కొత్త హెయిర్ స్టైల్ తో అదరగొట్టేస్తున్నాడు. బాహుబలి నుంచి కంప్లీట్ మేకోవర్ ఇచ్చేశాడనే సంగతి అర్ధమవుతూనే ఉంది. అయితే.. ఇంతలోనే ప్రభాస్ ఇంత ఛేంజ్ చూపిస్తాడనే విషయాన్ని ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయలేదు.
ఇక సాహో చిత్రంలో హీరోయిన్ పై ఇంకా సస్సెన్స్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పటికే ఓ భామకు ఫైనల్ అయ్యారని అంటున్నారు కానీ పేరు మాత్రం పైకి చెప్పడం లేదు.