Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Jun-2016 12:08:44
facebook Twitter Googleplus
Photo

ఇప్పటికే ఓవర్సీస్ నుండి చాలా రిపోర్టులు వచ్చేస్తున్న దరిమిళా.. అసలు ''అ..ఆ'' సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏమవుతుంది అనే విషయం మనం చూస్తే.. ఈ సినిమా ఎవరికి ఎందుకు ఇంపార్టెంట్ అనే విషయం మనం చూడాలి. అలా చూస్తే అందరికంటే త్రివిక్రమ్ కే ఈ సినిమా చాలా ముఖ్యం. ఎందుకంటే మనోడు ఏదో మ్యాజిక్ చేస్తాడని ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కాచుకుని కూర్చున్నారు.

తొలి రెండు రోజులూ సాధారణంగా ఫ్యాన్స్ హడావుడి ఎంత ఉన్నా కూడా.. ఆ తరువాత నుండి సర్దార్ అండ్ బ్రహ్మోత్సవం వంటి సినిమాలను చూడాల్సింది కేవలం ఫ్యామిలీ ఆడియన్సే. కాని వాళ్ళు ఈ సమ్మర్ లో బాగా డిజప్పాయింట్ అయ్యారు. అందుకే అందరూ అ..ఆ కోసం ఎదురు చూస్తున్నారు. కంటెంట్ కొత్తగా ఉన్నా పాతగా ఉన్నా కూడా.. త్రివిక్రమ్ మాత్రం తన మార్కు సీన్లతో డైలాగులతో ఎప్పుడూ ఇంప్రెస్ చేస్తూనే ఉంటారు. గతంలో సన్నాప్ సత్యమూర్తి వంటి సినిమాకు తొలిరోజు బిలో యావరేజ్ రేటింగులు వచ్చినా కూడా.. సినిమా హిట్టయ్యిందంటే.. దానికి కేవలం ఈ ఫ్యామిలీ ఆడియన్స్ కు సినిమా నచ్చయేడం వలన. కాబట్టి.. వాళ్లకి నచ్చేలా సినిమాను తీశాడా లేదా అనే పరీక్ష కేవలం త్రివిక్రమ్ ఒక్కడికే మరి.

ఇకపోతే సినిమాలో సమంత గ్లామ్ అండ్ యూత్ ఫుల్ లుక్ ఒక రేంజులో ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా అమ్మడు మెజార్టి పార్ట్ హీరో రోల్ ను చేసేసిందట. ఆమె ఫ్యాన్సుకు ఇక ఫుల్ విందే మరి.

,  ,  ,  ,  ,  ,