Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Jun-2015 12:34:37
facebook Twitter Googleplus
Photo

ఈ మధ్య కాలంలో అతిథి పాత్రలకి కూడా క్రేజ్ .. ఇమేజ్ వున్న నటీనటులను తీసుకోవడం జరుగుతోంది. ఈ విధంగా చేయడం వలన అది ఆ సినిమాకి ఓ ప్రత్యేకత అవుతుంది .. ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఇక క్రేజ్ వున్న నటీనటులు ఈ తరహా పాత్రలను పోషించడం వెనుక ఆయా చిత్రాలలో నాయకా నాయికలుగా నటిస్తోన్న వారి ఫ్రెండ్షిప్ ప్రధానపాత్రను పోషిస్తోంది. తమ స్నేహితులు చేసిన రిక్వెస్ట్ ను కాదనలేక అతిథి పాత్రల్లో కనిపించడానికి అంగీకరిస్తున్నారు.

అలా జీవీ ప్రకాశ్ కథానాయకుడుగా నటిస్తోన్న 'త్రిష ఇల్లన నయనతార' చిత్రంలో అతిథి పాత్రను చేయడానికి 'ఆర్య' అంగీకరించాడు. ప్రస్తుతం ఆయనకి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో జీవీ ప్రకాశ్ జోడీగా ఆనంది అలరించనుంది. కథానాయికల పేరుతో వస్తోన్న ఈ సినిమాపై సహజంగానే యూత్ లో ఆసక్తి మొదలైంది. దాంతో ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందనే కాన్ఫిడెంట్ తో జీవీ ప్రకాష్ ఉన్నాడట. మరి ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.

,  ,  ,  ,  ,  ,